యార్లగడ్డ సుమంత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== సినీ జీవితం ==
సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వం వహించిన ''[[ప్రేమ కథ]]'' చిత్రంతో మొదలైంది. ఇదీ, అతని రెండవ చిత్రం, [[యువకుడు]] పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన [[సినిమాలు]] అంతగా ఆడలేదు. అయితే 2003 లో [[జెనీలియా]] తో నటించిన [[సత్యం (2008 చిత్రం)|సత్యం]] తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత [[గౌరి]] కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని విఫలాలు తర్వాత, 2006 సంవత్సరం లో [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వంలో [[గోదావరి (సినిమా)|గోదావరి]] సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన [[చిన్నోడు]] అంతగా హిట్ కాలేదు. [[మధుమాసం]], [[పౌరుడు]] బాక్సాఫీస్ లో బాగానే ఆడి, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు కూడా నడిచాయి.
2009 లో వచ్చిన [[బోణి]] ప్లాప్ అయ్యింది. 2011 లో [[గోల్కొండ హై స్కూల్]] హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరస విఫలాలు తర్వాత 2017 లో [[మళ్ళీ రావా]] అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఈ మధ్య [[ఎన్.టీ.ఆర్:కథానాయకుడు]] లో అతని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు.