"అక్కన్న మాదన్న" కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్య జీవితం: అప్పుడు మనము నియోగిని కూడా తొలగించాలి
(Reverted good faith edits by MRRaja001 (talk): మూలం లోని సమాచారంలో సందేహమున్నప్పుడు అది సరియైన మూలం కాదు. (TW))
ట్యాగు: రద్దుచెయ్యి
(→‎బాల్య జీవితం: అప్పుడు మనము నియోగిని కూడా తొలగించాలి)
 
== బాల్య జీవితం ==
అక్కన్న మాదన్నలు [[హనుమకొండ]]లోని [[నియోగులు|నియోగి బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భానుజయ్య, భాగ్యమ్మ. భానుజయ్య హనుమకొండలో ''ఆమిల్'' (గోల్కొండ ప్రభుత్వాధికారి) దగ్గర ఉద్యోగం చేసేవాడు. చారిత్రక సాహిత్యంలో వీరు కులకర్ణి వంశపు కన్నడ బ్రాహ్మణులనియి, మహారాష్ట్రులనియు, శివాజీ ప్రధానియగు మోరోపంత్ పింగళే దాయాదులనియు కొన్ని వాదనలున్నవి. కానీ ఈ వాదమును సమకాలీనులగు మరే చరిత్రకారులు ప్రస్తావించలేదు. చారిత్రక నిదర్శనములు గానీ, స్థల పురాణములు గానీ ఈ వాదమునకు బలం చేకూర్చలేదు. మామిడిపూడి వేంకటరంగయ్య ఆధ్వర్యంలో ప్రచురించిన సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశం ప్రకారం వీరి పింగలి వంశం, మహారాష్ట్రలోని పింగళే వంశము వేరు. కానీ వీరు ఎచ్చటివారో చెప్పుటకు నిష్కర్షమైన ఆధారాలు లేవు. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం వీరు హనుమకొండకు చెందిన వారుగా తెలుస్తోంది.<ref>{{Cite book|url=https://ia801602.us.archive.org/11/items/in.ernet.dli.2015.386106/2015.386106.aandhra-vijnj-aana.pdf|title=సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటం|last=మామిడిపూడి|first=వేంకటరంగయ్య|publisher=సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ సమితి|year=1970|isbn=|location=హైదరాబాదు|pages=64}}</ref> వీరికి నలుగురు కొడుకులు. అక్కన్న, మాదన్న, విస్సన్న (విశ్వనాథం), మల్లన్న (మృత్యుంజయుడు). మరో ముగ్గురు సోదరీమణులు. వీరి పేర్లు తెలియవు గానీ వీరి కొడుకులు [[రామదాసు|కంచర్ల గోపన్న]], పొదిలి లింగన్న, పులిపల్లి ఎంకన్న (రూస్తం రావు).<ref>{{Cite wikisource|title=అక్కన్న మాదన్నల చరిత్ర}}</ref> ఒక సమకాలీన డచ్ మూలాల ప్రకారం అక్కన్న తన తల్లికి ఇష్టమైన వాడు. కానీ మాదన్న అందరికైనా తెలివైనవాడు. వీరు బహుశా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు. వీరు శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.<ref>Gijs Kruijtzer, [http://hdl.handle.net/1887/13850 Xenophobia in Seventeenth-Century India] (Leiden: Leiden University Press, 2009), 226-30.</ref> అక్కన్నకు మల్లు అనే కొడుకును, కూతురును ఉండిరి. మాదన్నకు మల్లన్న అనే కుమారుడూ, మరో కుమార్తె ఉండిరి.
 
భానుజయ్య తన కుమారులకు యుక్తవయస్సు రాగానే ఉపనయనం చేసి ఆ రోజుల్లో అవసరంగా ఉన్న పారసీ, హిందీ, సంస్కృతము, ఆంధ్రము లాంటి పలు భాషలు నేర్పించాడు. అక్కన్న వారసులు అక్కరాజులుగా, మాదన్న వారసులు మాదరాజులుగా ప్రాచుర్యం పొందారు.
300

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3155481" నుండి వెలికితీశారు