మద్రాస్ ఎ.కన్నన్: కూర్పుల మధ్య తేడాలు

61 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
(Created page with ''''మద్రాస్ ఎ.కన్నన్'''ఒక కర్ణాటక సంగీత మృదంగ వ...')
 
==విశేషాలు==
ఇతడు [[1920]]లో [[చెన్నై|మద్రాసు]]లో జన్మించాడు. ఇతడు మృదంగాన్ని తంజావూరు రామదాసరావు వద్ద నేర్చుకున్నాడు. ఇంకా ఇతడు వీణా వాదనను పీతాంబర దేశాయి వద్ద, గాత్ర సంగీతాన్ని కృష్ణస్వామి నాయుడు వద్ద నేర్చుకున్నాడు. ఇతడు తన సుదీర్ఘ సంగీత జీవితంలో ఎంతో మంది గాత్ర సంగీత విద్వాంసులకు, వాద్య కళాకారులకు మృదంగ సహకారాన్ని అందించాడు. ఇతడు ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయ విద్వాంసునిగా పనిచేశాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయపు సంగీత కళాశాలలోను, అనేక ప్రైవేటు కళాశాలలోను సంగీత పాఠాలు బోధించాడు. ఇతడిని అనేక సాంస్కృతిక సంఘాలు, సంగీత సభలు సత్కరించాయి. 2004లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు (మృదంగం) విభాగంలో [[సంగీత నాటక అకాడమీ అవార్డు]]ను ఇతడికి ఇచ్చింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
67,847

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3155500" నుండి వెలికితీశారు