మద్రాస్ ఎ.కన్నన్: కూర్పుల మధ్య తేడాలు

259 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
ఇతడు [[1920]]లో [[చెన్నై|మద్రాసు]] రాయపేట్‌లో జన్మించాడు. ఇతని తండ్రి ఆదిమూలం వ్యాపారవేత్త. ఇతడు మృదంగాన్ని తంజావూరు రామదాసరావు వద్ద నేర్చుకున్నాడు. ఇంకా ఇతడు వీణా వాదనను పీతాంబర దేశాయి వద్ద, గాత్ర సంగీతాన్ని కృష్ణస్వామి నాయుడు వద్ద నేర్చుకున్నాడు.
 
ఇతడు తన 8 యేళ్ళ వయసులో [[టైగర్ వరదాచారి]] సంగీత కచేరీకి తొలి సారి మృదంగం వాయించాడు<ref name="CMR">{{cite web |last1=లలితారాం |title=Madras Kannan – Interview |url=https://carnaticmusicreview.wordpress.com/2019/04/01/madras-kannan-interview/ |website=Carnatic Music Review |accessdate=16 March 2021}}</ref>. ఇతడు తన సుదీర్ఘ సంగీత జీవితంలో ఎంతో మంది గాత్ర సంగీత విద్వాంసులకు, వాద్య కళాకారులకు మృదంగ సహకారాన్ని అందించాడు. వీరిలో [[చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]], [[హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్]], గోటువాద్యం నారాయణ అయ్యంగార్, వీణ సుబ్బణ్ణ, [[అరియకుడి రామానుజ అయ్యంగార్]], [[చెంబై వైద్యనాథ భాగవతార్]], [[జి.ఎన్.బాలసుబ్రమణియం]], [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[మహారాజపురం విశ్వనాథ అయ్యర్]], [[దండపాణి దేశికర్]], [[టి.ఆర్.మహాలింగం]] మొదలైనవారు ఉన్నారు. ఇతడు ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయ విద్వాంసునిగా పనిచేశాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయపు సంగీత కళాశాలలోను, అనేక ప్రైవేటు కళాశాలలోను సంగీత పాఠాలు బోధించాడు.
 
ఇతని శిష్యులలో రామకృష్ణన్, రాజన్, శ్రీనాథ్, సురేష్, దీనదయాళన్ మొదలైన వారు ఇతని సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు<ref name="CMR" />.
 
==పురస్కారాలు, గుర్తింపులు==
67,847

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3155510" నుండి వెలికితీశారు