మద్రాస్ ఎ.కన్నన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
ఇతడిని అనేక సాంస్కృతిక సంఘాలు, సంగీత సభలు సత్కరించాయి. 1955లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి [[కె.కామరాజ్]] ఇతడిని "లయరత్నాకర" బిరుదుతో సత్కరించాడు. 1959లో స్వామి శివానంద సరస్వతి "మృదంగ సామ్రాట్" బిరుదును ఇచ్చాడు. భారత ప్రభుత్వం ఇతడిని మూడు నెలలపాటు ఆఫ్రికా దేశాలలో పర్యటించడానికి సాంస్కృతిక బృందంలో సభ్యునిగా నియమించింది. ఈ పర్యటనలో ఇతడిని ఇథియోపియా రాజు, లైబీరియా అధ్యక్షుడు బంగారు పతకాలతో సత్కరించారు. 1974లో ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ఇతడిని, [[ఈమని శంకరశాస్త్రి]]తో పాటు ఆహ్వానించింది. వీరిరువురూ నిర్వహించిన కచేరీ "శతాబ్దపు ఉత్తమ కచేరీ"గా ఎంపికయ్యింది. 1978లో ఇతనికి రష్యాలో ఇతనికి ఏషియన్ మ్యూజిక్ రోష్ట్రం అవార్డు ప్రకాటించారు.2002లో శృతి ఫౌండేషన్ ఇతడిని వెల్లూరు గోపాలాచారి అవార్డుతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం ఇతడిని "పంచనాద కళారత్న" బిరుదుతో సన్మానించింది. 2004లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు (మృదంగం) విభాగంలో [[సంగీత నాటక అకాడమీ అవార్డు]]ను ఇతడికి ఇచ్చింది.
==మరణం==
ఇతడు [[2019]] [[ఏప్రిల్ 1]]వ తేదీన మరణించాడు<ref name="CMR" />.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మద్రాస్_ఎ.కన్నన్" నుండి వెలికితీశారు