కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

28 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
శివరావు నాటకాల్లో [[హాస్యపాత్రలు]] ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. [[హాస్యం]] మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. [[వరవిక్రయం]] (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. [[చూడామణి]] (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో పడ్డాఅడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) తో ఇంకా బాగా తెలిసాడు. [[బాలరాజు]] (1948) ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
 
ఆ దశలోనే వచ్చిన [[గుణసుందరి కథ]], [[లైలా మజ్ను]], [[రక్షరేఖ]], [[శ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ)|శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. [[సినిమాలు]], ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. [[గుణసుందరి కథ]]లో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] హాస్య నటులతో తీసాడు. [[అక్కినేని నాగేశ్వరరావు|నాగేశ్వరరావు]] హీరో కాగా, హీరోయిన్‌గా, [[గిరిజ (నటి)|గిరిజ]]ను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
 
==వెలుగు తగ్గిన తార==
7,993

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3155804" నుండి వెలికితీశారు