కర్మ సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
పంక్తి 31:
కర్మ బ్రహ్మోద్భవం. ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి. కర్మలను ఆవరించి దోషం ఉంటుంది. కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మల వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు.
*కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉంది. అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి.కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు.తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి. అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు. గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు ఆ కర్మలలో చిక్కుకోడు. కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు. కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు.అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి. యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిష్ఠుడిని కర్మలు బంధించలేవు.
*గీతాకారుడు కర్మ వీడుటకు వీలులేదని, పని చేయనిచో జీవయాత్ర జరుగదు అని, పనిచేయక ఎవరు అరనిముషమైనను ఊరక ఉండజాలరని, ఇఛ్చ లేకున్నను రజోగుణములనుండి పుట్టిన కామ క్రోధములు కార్యమునందు నియోగించునని తెలిపినాడు.
*కర్మ జగత్తులో మనము బ్రతుకుచున్నాము. మనకు కాలుచేతులు కలవనియు, పనిచేయవలసి యున్నదనియు కార్యమునందు ప్రవృత్తి కలదనియు మనము తలంచుచున్నాము.మనము పని చెయుదము, సుఖ దుఃఖములలో తగులు కుందుము, సంసారములో మునుగు చుందుము, ఇదియే కర్మ బద్ధ స్థితి, కర్మ బంధన మోక్షమే మొక్షము.
*మనుష్యుడు తన ప్రకృతిని బట్టియే పని చేయుచుండును.ఆత్మ ప్రకృతితో కలిసి యున్నది. కొందరు సత్త్వ గుణ ప్రధానులు. కొందరు తమో గుణ ప్రధానులు, మరికొందరు రజో గుణ ప్రధానులు.మనుష్యుడు బయట కర్మ చేయుచున్నను మనసులోపల చేయునేడల అది కర్మ త్యాగము కాదు. దీని వలన గీతాకారుడు ఇంద్రియనిగ్రహము యొక్క శ్రేష్ఠత్వమును అంగీకరింపలేదు.
*కర్మ చేయుట మొదలెడినచో నైష్కర్మ్యము సిద్ధింపదని గీతాకారుని విశేషమతము.నైష్కర్మ్యమనగా కర్మ రాహిత్యము.
*ప్రకృతి యొక్క గుణముల వలన కర్మ జరుగు చున్నది. కాని అహంకార మూఢుడు నేనే కర్తనని తలంచును. యోగముక్తుడు కానివానికి సన్యాసము దుఃఖహేతువు అగును.
*కర్మయందెవడు అకర్మను మరియు ఆ కర్మయందు కర్మను చూచునో వాడు మనుష్యులలో బుద్ధికలవాడు, వాడు యోగి, వాడు సర్వకర్మ కాలి.
*కర్మ చేయుము కాని యోగస్థుడువై కర్మ చేయుము; ఫలము కోరనివాడవై కర్మ చేయుము.
 
==బౌద్ధంలో కర్మ==
"https://te.wikipedia.org/wiki/కర్మ_సిద్ధాంతం" నుండి వెలికితీశారు