వికీపీడియా:నిర్ధారత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాల, వాక్యనిర్మాణ దోషాల దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
===విశ్వసనీయమైన మూలాలు===
వికీపిడియాలోని వ్యాసాలు ఇతరులు ప్రచురించిన వాటిపై ఆధారపడుతాయి గనుక ఆ మూలాలు కూడా విశ్వసనీయమైనవి, సత్యానికి కట్టుబడేవి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనేవి అయి ఉండాలి.<ref>ఇక్కడ "మూలము" అంటే మూడు భాగాల మిశ్రమం - ఆ ప్రచురణ, దానిని సృష్టించిన (వ్రాసిన) వారు, దానిని ప్రచురించిన వారు. ఈ మూడూ కూడా విశ్వనీయతపై గణనీయమైన ప్రభావం కలిగి ఉండవచ్చును.</ref>. వ్రాసిన వ్యాసాలలోని విషయాన్ని నిర్ధారించడానికీ, దానిని ఎక్కడినుండి సేకరించారో ఆ రచయితలను, ప్రచురణ కర్తలను పేర్కొనడానికీ, గ్రంధ చౌర్యాన్ని అరికట్టడానికీ, [[వికీపీడియా:కాపీ హక్కులు|కాపీ హక్కుల ఉల్లంఘనను]] నిరోధించడానికీ కూడా ఈ ప్రమాణాలు పాటించడం చాలా అవసరం. మూలాలలో ఉన్నంత భావం కంటే ఎక్కువగా వికీపీడియా రచనలలో ధ్వనించరాదు. విపరీతమైన విషయాలకు ([[:en:Wikipedia:Verifiability#Exceptional claims require exceptional sources |exceptional claims]]) ఖచ్చితమైన మూలాలు మరింతగా అవసరమౌతాయి. అన్ని రచనలూ [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణానికి]] అనుగుణంగా ఉండాలి. ఆయా వ్యాసాలలో ఉన్న విషయాలపై ప్రధాన అభిప్రాయాలతో పాటు, ఇతర అభిప్రాయాలను కూడా తగినంతగా, ఆధారాలతో సహా, పేర్కొనాలి.
 
రచయితలు పేర్కొన్న మూలాలు ఆయా రంగాలకు చెందిన నమ్మకమైన ప్రచురణలు - జర్నల్‌లు, పాఠ్యపుస్తకాలు, ప్రధాన వార్తా పత్రికలు - అయితే వాటి పట్ల విశ్వాసం పెరుగుతుంది. విషయంలోని నిజాన్ని, దాని చట్టపరమైన సమస్యలను కూలంకషంగా పరిశీలించిన తరువాత ప్రచురించే ప్రచురణలు విశ్వసనీయమైన మూలాలు అనవచ్చును. అన్నింటికంటే, ఆయా రంగాల్లోని నిపుణుల పరిశీలనలో వెలువడే ప్రచురణలు అత్యంత ఆదరణీయాలు. వీటి గురించిన మరికొన్ని వివరాలు [[:en:Wikipedia:Reliable sources|ఈ ఆంగ్ల వికీ వ్యాసంలో]] చూడవచ్చును.