జానా కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
పంక్తి 33:
1975లో [[అత్యయిక పరిస్థితి]] విధించినప్పుడు, అందుకు వ్యతిరేకతా ఉద్యమానికి తమిళనాడులో కార్యదర్శిగా ఉన్నాడు. 1977లో భారతీయ జనసంఘ్, జనతా పార్టీలో విలీనమైనప్పుడు, జనతాపార్టీ యొక్క తమిళనాడు విభాగానికి ప్రధానకార్యదర్శి అయ్యాడు. 1980లో అటల్ బిహారీ వాజపేయి, [[లాల్ కిషన్ అద్వానీ]], [[ఎస్.ఎస్.భండారీ]], [[కుష్‌భావూ ఠాక్రే]], [[జగన్నాథరావు జోషీ]] తదితరులతో కలిసి భారతీయ జనతాపార్టీ స్థాపనకు సహాయం చేశాడు. ఈయన పార్టీకి వ్యవస్థాపక జాతీయ కార్యదర్శి. 1983లో ప్రధాన కార్యదర్శుల్లో ఒకడిగానూ, 1985 నుండి పార్టీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశాడు.
 
1980 నుండి 1990 వరకు కృష్ణమూర్తి, భారతీయ జనతా పార్టీని దక్షిణాది రాష్ట్రాలైన, [[కేరళ]], [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[ఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}లలో విస్తరింపజేయటానికి కృషిచేశాడు.
 
1993లో ఎల్.కే.అద్వానీ కోరిక మేరకు [[ఢిల్లీ]] వెళ్ళి, అక్కడ ఆర్ధిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాలపై విధానాలను రూపొందించేందుకు భాజపా మేధోవర్గాలను స్థాపించాడు. 1995 నుండి భాజపా ప్రధానకార్యాలయపు నిర్వహణాబాధ్యతలు చూసుకొన్నాడు. కొంతకాలం పార్టీ ప్రధానగళంగా కూడా పనిచేశాడు. 1998లో కృష్ణమూర్తి, [[దక్షిణ చెన్నై నియోజకవర్గం]] నుండి లోక్‌సభకు పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2001 మార్చి 1న పార్టీ అధ్యక్షపదవి బంగారు లక్ష్మణ్ నుండి తీసుకొని, 2002 జూన్ వరకు భాజపా అధ్యక్షుడిగా కొనసాగాడు.
"https://te.wikipedia.org/wiki/జానా_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు