నామగిరిపేట్టై కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox musical artist | name = నామగిరిపేట్టై కాథన్ కృష్ణన్ | native_name = நாமகி...'
 
పంక్తి 21:
'''నామగిరిపేట్టై కె. కృష్ణన్''' ( 1924 – 2001) ఒక కర్ణాటక సంగీత నాదస్వర విద్వాంసుడు.
==విశేషాలు==
ఇతడు [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[నామగిరిపేట్టై]] గ్రామంలో [[1924]], [[ఏప్రిల్ 2]]వ తేదీన ఒక కర్ణాటక సంగీత కుటుంబంలో జన్మించాడు. ఇతడు సెందమంగళం గ్రామంలో నివసించాడు. ఇతడు నాదస్వరంలో శిక్షణను తన తాత చిన్నప్ప మొదలియార్ వద్ద, అరుప్పుకొట్టై గణేశపిళ్ళైల వద్ద తీసుకున్నాడు. ఇతడు దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.
నాదస్వరంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా ఇతనికి ఎన్నో పురస్కారాలు లభించాయి. 1972లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడిని [[కళైమామణి]] పురస్కారంతో గౌరవించింది. 1974లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]]కు ఆస్థాన విద్వాంసుడిగా నియమించబడ్డాడు. 1977లో తమిళనాడు ప్రభుత్వం ఇతడిని ఆస్థాన సంగీత విద్వాంసునిగా గౌరవించింది. 1981లో భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం]] ఇతడికి ప్రకటించింది.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/images/ps_awards.pdf|title=List of Padmashri awardees|publisher=[[Government of India]]|access-date=18 November 2010}}</ref> 1981లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] ఇతడికి కర్ణాటక సంగీతం - వాద్యం (నాదస్వరం) విభాగంలో [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను ప్రకటించింది. ఇతడు ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నాడు. తిరువాయూరులోని త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు ఉపాధ్యక్షుడిగా సేవలను అందించాడు.
 
==పురస్కారాలు==