నామగిరిపేట్టై కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
'''నామగిరిపేట్టై కె. కృష్ణన్''' ( 1924 – 2001) ఒక కర్ణాటక సంగీత నాదస్వర విద్వాంసుడు.
==విశేషాలు==
ఇతడు [[తమిళనాడు]] రాష్ట్రంలోని నామగిరిపేట్టై గ్రామంలో [[1924]], [[ఏప్రిల్ 2]]వ తేదీన ఒక కర్ణాటక సంగీత కుటుంబంలో జన్మించాడు. ఇతడు సెందమంగళం గ్రామంలో నివసించాడు. ఇతడు నాదస్వరంలో శిక్షణను తన తాత చిన్నప్ప మొదలియార్ వద్ద, అరుప్పుకొట్టై గణేశపిళ్ళైల వద్ద తీసుకున్నాడు<ref name="SNA">{{cite web |last1=web master |title=Namagiripettai K. Krishnan |url=https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=583&at=2 |website=SANGEET NATAK AKADEMI |publisher=SANGEET NATAK AKADEMI |accessdate=20 March 2021}}</ref>. ఇతడు దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.
నాదస్వరంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా ఇతనికి ఎన్నో పురస్కారాలు లభించాయి. 1972లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడిని [[కళైమామణి]] పురస్కారంతో గౌరవించింది. 1974లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]]కు ఆస్థాన విద్వాంసుడిగా నియమించబడ్డాడు. 1977లో తమిళనాడు ప్రభుత్వం ఇతడిని ఆస్థాన సంగీత విద్వాంసునిగా గౌరవించింది. 1981లో భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం]] ఇతడికి ప్రకటించింది.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/images/ps_awards.pdf|title=List of Padmashri awardees|publisher=[[Government of India]]|access-date=18 November 2010}}</ref> 1981లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] ఇతడికి కర్ణాటక సంగీతం - వాద్యం (నాదస్వరం) విభాగంలో [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను ప్రకటించింది. ఇతడు ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నాడు. తిరువాయూరులోని త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు ఉపాధ్యక్షుడిగా సేవలను అందించాడు.