"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించాడు. ప్రాథమిక విద్య [[నగరి]] లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశాడు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. [[శ్రీకాళహస్తి]]<nowiki/>లో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు [[చెంచులక్ష్మి (1958 సినిమా)|చెంచులక్ష్మి]] సినిమాలో [[పి.సుశీల|సుశీల]] పాడిన ''పాలకడలిపై శేషతల్పమున'' అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ''ఈ ఇల్లు అమ్మబడును'', ''ఆత్మహత్య'' లాంటి నాటకాల్లో నటింప జేశాడు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు. [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ కేంద్రం]]<nowiki/>లో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
 
[[తిరుపతి]]<nowiki/>లో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరికననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు. <ref>{{cite interview|last=ఎస్పీ|first=బాలసుబ్రహ్మణ్యం|subjectlink=|interviewer=యమునా కిషోర్|title=ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ {{!}}{{!}} కాఫీ విత్ యమునా కిషోర్|url=https://www.youtube.com/watch?v=LWRleubHaVM|callsign=|city=|date=|program=|accessdate=}}</ref>
 
=== గాయకునిగా ప్రయత్నం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159138" నుండి వెలికితీశారు