బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''బంగాళాఖాతం''' [[హిందూ మహాసముద్రం]] ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ,వాయువ్య దిశలో [[భారత దేశం|భారతదేశం]], ఉత్తరాన [[బంగ్లాదేశ్]], తూర్పున [[మయన్మార్]], [[భారత దేశం|భారతదేశంలోని]] [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ మరియు నికోబార్ దీవులు]] ఉన్నాయి. దాని దక్షిణ పరిధి సంగమన్ కందా, [[శ్రీలంక]] , సుమత్రా (ఇండోనేషియా) వాయువ్య బిందువు మధ్య ఉన్న రేఖ. ఇది ప్రపంచంలో ఖాతం (బే) అని పిలువబడే అతిపెద్ద నీటి ప్రాంతం. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని [[కళింగ(చారిత్రక భూభాగం)|కళింగ]] సాగర్ అనేవారు. తరువాత బ్రిటీష్ భారతదేశంలో, చారిత్రాత్మక [[బెంగాల్]] ప్రాంతంలోని కలకత్తా [[భారతదేశంలో బ్రిటిషు పాలన|భారతదేశంలో బ్రిటీష్ పాలనకు]] రాజధాని కావటంతో ఆ ప్రాంతపేరుతో బంగాళాఖాతంగా పిలవబడింది. కోల్‌కతా నౌకాశ్రయం. కాక్స్ బజార్, ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర బీచ్, [[సుందరవనాలు|సుందర్బన్స్]], అతిపెద్ద మడ అడవులు, బెంగాల్ పులి యొక్క సహజ ఆవాసాలు దీని హద్దులో వున్నాయి.
 
బంగాళా ఖాతం విస్తీర్ణం {{Convert|2600,000|km2}}. దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: [[గంగా నది|గంగా]] - [[హుగ్లీ నది|హుగ్లీ]], [[పద్మ నది|పద్మ]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, [[గోదావరి]], [[మహానది]], బ్రాహ్మణి, బైతారాణి, [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరి నది|కావేరి]]. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, [[కొలంబో]], కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, [[పోర్ట్ బ్లెయిర్]], మాతర్బారి, తూతుకూడి, [[విశాఖపట్నం నౌకాశ్రయం|విశాఖపట్నం]], ధర్మా మొదలైనవి ముఖ్యమైన నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.
 
==పేరు ఉత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు