"అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్" కూర్పుల మధ్య తేడాలు

చి
స్పష్టత కోసం వర్ణ వ్యవస్థ ని చాతుర్వర్ణ వ్యవస్థగా మార్చాను.
(రెండు వాక్యాలు సవరించాను.)
చి (స్పష్టత కోసం వర్ణ వ్యవస్థ ని చాతుర్వర్ణ వ్యవస్థగా మార్చాను.)
"అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్"‌ (Annihiliation of Caste) అన్నది 1936 లో [[బి.ఆర్‌. అంబేడ్కర్‌]] రాసిన పుస్తకం పేరు. నిజానికి ఇది మొదట ఒక సభలో ఇవ్వాల్సిన ప్రసంగానికి పాఠం. తరువాత ఆ సభ జరుగనందున అంబేడ్కర్ దీనిని ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఈ రచనలో అంబేడ్కర్ భారతదేశంలోని కులవ్యవస్థ పుట్టుపూర్వత్తరాలను గురించి, దానికి పూర్వపు స్థితిగా చెబుతున్న వర్ణచాతుర్వర్ణ వ్యవస్థ లోని మంచి చెడుల గురించి విశ్లేషించి, ఈ వ్యవస్థ దేశ సమైక్యతకు హానికారకమని తీర్మానించాడు. స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న ఆధునిక సామాజిక వ్యవస్థ నిర్మితమవ్వాలంటే హిందూ మత గ్రంథాలని ధిక్కరించాలని సూచించాడు. అంబేడ్కర్ చేసిన అనేక రచనల మధ్య చాలా పేరొందిన రచన ఇది. మరాఠీ, హిందీ, పంజాబీ, మలయాళం వంటి అనేక భాషల్లోకి అనువాదం కూడా చేశారు. {{Infobox book||series=|oclc=498680197|isbn=978-8189059637|media_type=|release_date=1936|publisher=|genre=|language=ఆంగ్లం|name=అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్|country=భారతదేశం|cover_artist=|author=[[బి.ఆర్‌. అంబేడ్కర్‌]]|caption=పుస్తకం తొలి ముద్రణ కవర్ పేజీ|image=First edition of Annihilation of Caste.jpg|translator=|title_orig=|preceded_by=}}
 
== రచనా నేపథ్యం<ref>''[https://www.mea.gov.in/Images/attach/amb/Volume_01.pdf Dr. Babasaheb Ambedkar Writings & Speeches Vol. 1]''</ref> ==
ఈ రచన/ప్రసంగం భారతదేశపు కుల వ్యవస్థలో సతి, బాల్య వివాహాలు, అస్పృశ్యత వంటి అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయని ఎందరో వాదించినా ఎందుకు సంఘ సంస్కరణ కష్టం? అన్న ప్రశ్న గురించిన విచారణతో మొదలవుతుంది. ఇక్కడే ఇతర దేశాలలో ఉన్న ఇటువంటి వ్యవస్థలతో పోలిస్తే కుల వ్యవస్థలో తేడాలు ఏమిటి అన్నది కూడా చర్చించి "కుల వ్యవస్థ ఉత్త శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన కూడా" (Caste System is not merely division of labour. It is also a division of labourers.), శ్రామికులని శ్రేణీకరించి ఈ పని గొప్ప, ఈ పని కాదు అన్న విభజన చేయడం ఇతర దేశాల వ్యవస్థలలో లేదు అని తీర్మానించాడు రచయిత.
 
అలాగే కుల వ్యవస్థ ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ దేశానికి మేలు చెయ్యదు అని తన వాదనలతో నిరూపించాడు. కుల వ్యవస్థ దేశంలో హిందువుల మధ్య ఐక్యత లేకుండా చేసింది అని వాదించాడు. భారతదేశానికి వివక్షలేని, స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న ఆధునిక సామాజిక వ్యవస్థ కావాలి అని అన్నాడు. తరువాత కుల వ్యవస్థకు ముందుది, ఇలాంటి భావాలు కలది అని చెప్పబడుతున్న వర్ణచాతుర్వర్ణ వ్యవస్థ వైపుకి దృష్టి సారిస్తాడు. ఈ చతుర్వర్ణచాతుర్వర్ణ వ్యవస్థను వివరంగా చర్చించి, పరిశీలించి, ఆ వ్యవస్థ గురించిన సిద్ధాంతంలో ఉన్న లోపాలను చూపుతూ, అది ఆచరణలో అసాధ్యమని తీర్మానించాడు.
 
తరువాత, కుల వ్యవస్థ నిర్మూలన జరిగితే కానీ దేశాభివృద్ధి జరగదనీ, దేశంలోని ప్రజల మధ్య సమైక్యత ఉండదనీ వాదించాడు. మరి ఈ వ్యవస్థని నిర్మూలించడం ఎలా?‌అన్న ప్రశ్న కి జవాబుగా కులాంతర వివాహాల ని ప్రోత్సహించినా అది చాలదనీ, హిందూ మత గ్రంథాలు, శాస్త్రాల సరైన తాత్పర్యం కంటే జనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నది గమనిస్తే, కుల వ్యవస్థని సమర్థిస్తాయని అనేక హిందువులు భావిస్తున్నారనీ, కనుక వాటిని ధిక్కరించాలనీ అన్నాడు. ఈ విధంగా ఒక మతాన్నే విచ్ఛిన్నం చేసి సంస్కరణలు తేవడం అసాధ్యమని కూడా గుర్తించాడు.
133

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159401" నుండి వెలికితీశారు