మహాడ్ సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

5 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
→‎నేపథ్యం[1]: నేపథ్యంలో తేది రాసి సంవత్సరం రాయలేదు. ఇపుడు చేర్చాను.
(మహాడ్ సత్యాగ్రహం గురించి పేజి ని సృష్టించాను. అంబేడ్కర్ సమగ్ర రచనలు పదిహేడవ భాగంల ఈ సంఘటన గురించి అప్పటి వార్తా పత్రికలలో వచ్చిన వివరాలతో సహా ఇచ్చారు. వాటి ఆధారంగా వ్యాసం రాశాను.)
 
చి (→‎నేపథ్యం[1]: నేపథ్యంలో తేది రాసి సంవత్సరం రాయలేదు. ఇపుడు చేర్చాను.)
భారతీయ కుల వ్యవస్థలో దళితులు ఎన్నో విధాల వివక్షకు గురయ్యారు. ఇందులో ఒకటి జనం నీళ్ళు తాగడం కోసం ఉన్న చెరువులను వాళ్ళని వాడుకోనివ్వకపోవడం. దీనికి వ్యతిరేకంగా బాంబే రాష్ట్ర శాసనమండలి 1923 ఆగస్టులో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉన్న చెరువులలో ఎవరైనా నీళ్ళు తాగవచ్చని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనిని అమలుపరచడానికి జనవరి 1924లో మహాడ్ పురపాలక మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, సవర్ణ హిందువుల నుండి వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ తీర్మానం ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు.
 
ఈ నేపథ్యంలో కొలాబా జిల్లా అణుగారిన వర్గాల సంఘం వారు దళిత సానుభూతిపరులైన స్థానిక సవర్ణ హిందువులతో కలిసి మహాడ్ లో 1927 మార్చి 19-20 మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించదలుచుకుని [[బి.ఆర్‌. అంబేడ్కర్‌|బి.ఆర్. అంబేడ్కర్]] ను దానికి ఆహ్వానించారు. ఈ సమావేశం గురించి తెలుసుకుని దాదాపు పదివేల మంది వివిధ వయసుల దళిత ప్రజలు మహారాష్ట్ర, గుజరాత్ లలోని చాలా ఊళ్ళ నుండి తరలి వచ్చారు. వీరందరికీ మంచినీటి సరఫరాకి వసతి లేక సవర్ణ హిందువుల నుండి నలభై రూపాయలకి నీటిని కొనుక్కున్నారు సమావేశ నిర్వహకులు.
 
సమావేశం తొలి దినం అంబేడ్కర్ సహా పలు ప్రముఖుల ప్రసంగాలు ముగిశాక, తమ సానుభూతిపరులైన సవర్ణ హిందువుల అభిప్రాయాలు కూడా సేకరించాక మరుసటి రోజు అందరూ కలిసి మహాడ్ లో ఉన్న చవదార్ చెరువు వద్దకు వెళ్ళి దళితుల నీటి హక్కును సత్యాగ్రహ పద్ధతిలో ఉద్ఘాటించాలని నిర్ణయించుకున్నారు.
134

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159735" నుండి వెలికితీశారు