రాజేశ్వరీ పద్మనాభన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==విశేషాలు==
ఈమె కారైక్కుడి వీణ సంప్రదాయానికి చెందిన తొమ్మిదవ తరం వైణికురాలు.<ref name="ధ్వని">{{cite web |last1=web master |title=RAJESWARI PADMANABHAN (1939-2008) |url=https://dhvaniohio.org/rajeswari-padmanabhan-1939-2008/ |website=ధ్వని |accessdate=26 March 2021}}</ref> ఈమె 1939వ సంవత్సరంలో కొల్లూరులో జన్మించింది. ఈమె తల్లి పేరు లక్ష్మీ అమ్మాళ్. ఈమె తాత కారైక్కుడి బ్రదర్స్‌గా పేరుపొందిన వారిలో పెద్దవాడైన కారైక్కుడి సుబ్బరామ అయ్యర్.
 
ఈమె తన ఐదవ యేటి నుండే [[కారైక్కుడి సాంబశివ అయ్యర్]] వద్ద గురుకుల పద్ధతిలో 1958లో అతడు మరణించేవరకూ సంగీత శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వ ఉపకారవేతనం పొంది [[మైసూరు వాసుదేవాచార్య]]వద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించింది. ఈమె చెన్నైలోని "కళాక్షేత్ర" ప్రిన్సిపాల్‌గా పనిచేసి అనేక సంవత్సరాలు సంగీతాన్ని బోధించింది. కొన్ని వర్ణనలకు, తిల్లానలకు స్వరకల్పన చేసింది. "కుంభేశ్వరర్ కురవంజి" అనే నృత్య సంగీత నాటికకు సంగీతం సమకూర్చింది.