ఆర్.పిచ్మణి అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఆర్.పిచ్చుమణి అయ్యర్''' ఒక కర్ణాటక సంగీత వైణిక విద్వాంసుడు. ==...'
 
పంక్తి 3:
ఇతడు [[1920]], [[మే 18]]వ తేదీన ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో [[తమిళనాడు]] రాష్ట్రం, [[నాగపట్నం]]లో జన్మించాడు. ఇతడు తన 10వ ఏటి నుండి జలర్ గోపాల అయ్యర్ వద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించాడు. తరువాత తిరుచ్చి కుప్పణ్ణ వద్ద వీణావాదనం నేర్చుకున్నాడు. ఇతడు తిరుచిరాపల్లిలోని నేషనల్ కాలేజీలో ఎస్.ఎస్.ఎల్.సి.వరకు చదివాడు. తన 15వ యేట నేషనల్ కాలేజీ నిర్వహించిన కర్ణాటక గాత్ర సంగీత పోటీలలో బహుమతి గెలుచుకున్నాడు.
 
తరువాత ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయంలో చేరి వీణలో "సంగీత భూషణం" పట్టాను సంపాదించాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో మహామహులైన [[టైగర్ వరదాచారి]], [[కె.ఎస్.నారాయణస్వామి]], వి.ఎస్.గోమతి శంకర అయ్యర్ వంటి విద్వాంసుల వద్ద శిష్యరికం చేశాడు. 1940 నుండి ఇతడు వేలాది కచేరీలు దేశవిదేశాలలో అనేక సభలలో, ఆకాశవాణిలో చేశాడు.
 
సినిమా దర్శకుడు [[కె.సుబ్రమణ్యం]] ఇతడిని తన సినిమాపాటలలో వీణ వాయించడానికి మద్రాసుకు తీసుకువచ్చాడు. ఇతడు 1941లో జుపిటర్ స్టూడియోలో వీణ కళాకారుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో ఇతడు ఎందరికో వీణలో పాఠాలు చెప్పాడు. వారిలో ఎ.వి.ఎం. స్టూడియో అధినేత ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి భార్య రాజేశ్వరి కూడా ఉంది. ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి ఇతడి ప్రతిభను గుర్తించి తన స్టూడియోలో పర్మనెంటు ఉద్యోగం ఇచ్చాడు. తరువాత ఇతడు ఎ.వి.ఎం. నిర్మించిన అనేక సినిమాల పాటలలో వీణావాదనను చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్.పిచ్మణి_అయ్యర్" నుండి వెలికితీశారు