సూర్యదేవర సంజీవదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 38:
'''డా.సూర్యదేవర సంజీవ దేవ్''' ([[ఆంగ్లం]]: Suryadevara Sanjeevdev) ([[1914]] [[జూలై 3]] - [[1999]] [[ఆగష్టు 25]]) తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను ''[[తెగిన జ్ఞాపకాలు]]'' పేరిట రచించాడు. [[మంగళగిరి]], [[తెనాలి]]కి మధ్యన గల [[తుమ్మపూడి]]లో జన్మించాడు.
 
ఈయన జీవితమే మహత్తరమైనది. బాల్యంలోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు. హిమాలయాలలో కొంత కాలమున్నారు. అక్కడ ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర [[భారతదేశం]] మొత్తం తిరిగాడు. [[హిందీ]], [[బెంగాలీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], [[జపానీస్]] నేర్చుకున్నాడు.<ref>refhttps://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/</ref>. [[ఎస్పరాంటో]] అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. [[లక్నో]]లో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. ఇతని [[కలం స్నేహం]] అపరితమైనది. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవాడు. అమెరికాలోని [[ఆల్డస్ హక్స్‌లీ]] నుంచి అమెరికాలో స్థిరపడిన చిత్రకారుడు రామారావు వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. [[జిడ్డు కృష్ణమూర్తి]] నుంచి [[బుచ్చిబాబు]], [[గోపీచంద్]] ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. [[రాహుల్ సాంకృత్యయన్]] నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ [[రవీంద్రనాధ టాగోర్]] నుండి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉండేది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవదేవ్ వల్ల [[తెలుగు]] ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు.
 
మానవతావాది అయిన సంజీవదేవ్ ఏ ప్రాంతమూ పరాయిది కాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టాడు. ఈయన 1999 ఆగస్టు 25న మరణించాడు.