అశ్మక జనపదం: కూర్పుల మధ్య తేడాలు

చి cp
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Ancient india.png|right|150px300px|thumb|<center>సా.శ.పూ. 600 నాటి మహాజనపదాలు</center>]]
సామాన్య శక పూర్వం 6వ శతాబ్దానికి చెందిన షోడశ (16) మహాజనపదాలలో '''అశ్మక జనపదం''' (Ashmaka Janapada) ఒకటి. షోడశ మహాజనపదాలలో దక్షిణాదిలోని ఏకైక జనపదంగా ప్రసిద్ధి చెందిన దీనిని "అస్సక" అనే పేరుతోనూ చరిత్రకారులు పిలుస్తారు. ప్రాచీన బౌద్ధగ్రంథం "అంగుత్తర నికయ"లో కూడా ఇది వర్ణించబడింది. [[గోదావరి నది|గోదావరి]]-[[కృష్ణానది|కృష్ణా]]నదుల మధ్యలో నేటి [[తెలంగాణ]] లోని చాలా ప్రాంతం ([[ఆదిలాబాదు జిల్లా]] , తూర్పు తెలంగాణ మినహా), నేటి మహారాష్ట్రం లో కొంతభాగం ఈ జనపదంలో భాగంగా ఉండేది. [[మంజీరా నది]] పరీవాహక ప్రాంతంలో ఈ జనపదం ఉన్నతంగా వర్థిల్లింది. పోదన్ దీనికి రాజధానిగా ఉండేది. <ref>తెలంగాణ చరిత్ర, రచన- సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 28</ref> పోదన్ లేదా పౌఢన్యాపురం గా పిలుబడిన నాటి రాజధానియే నేటి [[బోధన్]] పట్టణంగా (ప్రస్తుతం నిజామాబాదు జిల్లాలో ఉంది) చరిత్రకారులు నిర్థారించారు.
 
"https://te.wikipedia.org/wiki/అశ్మక_జనపదం" నుండి వెలికితీశారు