శాసనసభ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మొలక వ్యాసం విస్తరణ,మూలాలు కూర్పు
పంక్తి 11:
* శాసనసభ సభ్యుడుగా ఉన్న వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడకూడదు, 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించఉండరాదు
*శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, కోర్టు చేత దోషిగా నిర్ధారించబడితే, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో దోషిగా తేలితే ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండలేరు.
 
== శాసనసభ సభ్యుడు అధికారాలు, విధులు ==
శాసనసభ సభ్యుల అధికారాలు, విధులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.<ref name=":0">{{Cite web|url=https://bengaluru.citizenmatters.in/5249-what-is-the-duty-of-an-mla-5249|title=What is the duty of an MLA; What are the privileges?|last=Balasubramaniam|first=Dr R.|date=2013-05-02|website=Citizen Matters, Bengaluru|language=en-GB|access-date=2021-04-03}}</ref>
 
=== శాసన అధికారాలు ===
శాసనసభ అతి ముఖ్యమైన పని చట్ట తయారీ. భారత రాజ్యాంగం - ఏడవ షెడ్యూల్ (ఆర్టికల్ 246) ద్వారా నిర్వచించినట్లుగా, జాబితా II (రాష్ట్ర జాబితా), జాబితా III (ఏకకాలిక జాబితా) లోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించడానికి ఎమ్మెల్యేలకు అధికారం ఉంది. వాటిలో కొన్ని పోలీసు, జైళ్లు, నీటిపారుదల, వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాలు, ప్రజారోగ్యం, తీర్థయాత్రలు, శ్మశానవాటికలు మొదలైనవి. పార్లమెంటు, రాష్ట్రాలు చట్టాలు చేయగల కొన్ని అంశాలు విద్య, వివాహం, విడాకులు, అడవులు, అడవి జంతువుల, పక్షులు రక్షణ మొదలగునవి.<ref name=":0" />
 
=== ఆర్థిక అధికారాలు ===
అసెంబ్లీ, ఎమ్మెల్యేల తదుపరి ముఖ్యమైన పాత్ర ఆర్థిక బాధ్యత. శాసనసభ రాష్ట్ర ఆర్ధికవ్యవస్థపై నియంత్రణను కలిగి ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌ను ఆమోదించాలి.పరిపాలన వ్యాపారం కోసం తగినంతగా లేదా తగిన విధంగా డబ్బు కేటాయించబడిందని నిర్ధారించుకోవాలి.<ref name=":0" />
 
=== కార్యనిర్వాహక అధికారాలు ===
కార్యనిర్వాహక పర్యవేక్షణ కూడా ఉంది.ఎగ్జిక్యూటివ్ అమలు చేసే అన్ని కార్యక్రమాలు, పథకాలను శాససభ్యులు పర్యవేక్షిస్తారు లేదా పరిశీలిస్తారు.దీని అర్థం వారు కేవలం లబ్ధిదారుల జాబితాలు, గృహాలను ఆమోదించే కమిటీలలో కూర్చుని స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారో నిర్ణయిస్తారు. ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ తన పనిని బాధ్యతాయుతంగా, ప్రతిస్పందనగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, రాజకీయ కార్యనిర్వాహక నిర్ణయాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని వారు భావించవచ్చు.<ref name=":0" />
 
=== ఎన్నికల అధికారం ===
భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో రాష్ట్ర శాసనసభ తరపన శాసన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు.శాసనసభలో ఎన్నికైన సభ్యులు, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులతో ఈ ప్రక్రియ జరుగుతుంది.<ref name=":0" />
 
=== రాజ్యాంగ అధికారాలు ===
భారత రాజ్యాంగంలోని కొన్ని భాగాలను పార్లమెంటు, సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరించవచ్చు.ఆ విధంగా రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్ర శాసనసభలు తరుపున శాసనసభ్యులు కీలక పాత్ర ఉంది.<ref name=":0" />
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శాసనసభ_సభ్యుడు" నుండి వెలికితీశారు