షేక్ నాజర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కళాప్రతిభ: AWB తో టైపాట్ల సవరణ, typos fixed: , → ,
పంక్తి 32:
 
==కళాప్రతిభ==
ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌. , అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి పూలరంగడు సినిమాలో [[అక్కినేని]]కి నేర్పించారు. చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన సినీ సంగీత దర్శకులు [[ఎస్‌. రాజేశ్వరరావు]] సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆసామీ నాటకాన్ని రచించాడు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఆసామి నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.<ref name=najar/>
 
రంగస్థల మహానటుడు [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవాచార్యులు]] నాజరు బుర్రకథ విని అమితానందంతో [[బళ్లారి]]కి ఆహ్వానించడం, [[మద్రాసు]]లో ప్రదర్శన చూచిన డా: [[గోవిందరాజుల సుబ్బారావు]] నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె. అబ్బాస్ నాజరును ''ఆంధ్ర అమరషేక్'' అని అభివర్ణించడం కామ్రేడ్ [[పుచ్చలపల్లి సుందరయ్య]] నాజరు [[ప్రజాభాష]]కు ముగ్ధుడై 'నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.
"https://te.wikipedia.org/wiki/షేక్_నాజర్" నుండి వెలికితీశారు