వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 857:
;యర్రా రామారావు అభిప్రాయాలు
:వికీపీడియాలో విశేషవ్యాసానికి తగినప్రామాణికతలు ఏమీ సముదాయంలో నిర్థారించకుండా లేదా నిర్ణయంలేకుండా ఏదేని వ్యాసానికి విశేషవ్యాసంగా సింబల్ గా ఆకుపచ్చ నక్షత్రం, పసుపుపచ్చ నక్షత్రం , లేదా ఇంకొక ఏదేని సింబల్ వాడటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:59, 3 ఏప్రిల్ 2021 (UTC)
నేను ఇంతకుముందు [[మూస చర్చ:ఈ వారం వ్యాసం]] వద్ద నా అభిప్రాయాలు చెప్పాను. రచ్చబండలోకి ఈ చర్చను తరలించాలనీ లేదా కనీసం నోటిఫై చేయాలని కూడా అందులో రెండు పాయింట్లు రాశాను. ఇక్కడ చర్చిస్తున్న తోటి సభ్యులు కూడా చూసేందుకు వీలయ్యేలా వాటిని తీసేసి మిగిలిన పాయింట్లు ఇక్కడ చేరుస్తున్నాను.
:* అర్జున గారు, ఈవారం వ్యాసాలకు ప్రదర్శిత వ్యాసం అని ఒక మూస పెట్టి, వ్యాసంలో కుడిచేతివైపున ఒక పచ్చ నక్షత్రం వచ్చేలా గౌరవం కల్పిస్తానంటున్నారు. ఎందుకు అంటే రెండు కారణాలుగా 1) వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం 2) ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు చేసి, తద్వారా, ఆసక్తి గల సభ్యులు వీటిపై దృష్టి పెట్టేలా చేసి వాటి నాణ్యతను అభివృద్ధి చేసే అవకాశం కల్పించవచ్చు.
:* మొదటి ఉద్దేశం పట్ల నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకంటే - అసలు వీటి నాణ్యత ఏమిటన్నది మనకు తెలియదు. వీటిని ఎంపిక చేయడానికి ఉన్న కొలమానాలు ఏమిటి? ఒకటి - కనీసం 5 బైట్లు ఉండాలి. రెండు - గతంలో ప్రదర్శింపబడి ఉండకూడదు. మూడు - అనువదించాల్సిన భాగాలు ఉండకూడదు. నాలుగు - కనీసం ఒక బొమ్మ ఉండాలి. ఈ నాలుగిటిలో నాణ్యత గురించి కానీ, వ్యాసం విలువ గురించి కానీ ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఏ వ్యాసం నాణ్యత ఏదో కనీసం మదింపు కూడా లేకుండా ఇలాంటి గౌరవం లేక ప్రత్యేకత కల్పించకూడదు.
:* ఇటీవలి మార్పుల్లో ఈ వ్యాసాల్లో మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటుచేయడంపై నేనేమీ వ్యతిరేకం కాదు. కానీ, ఒక మూస/వర్గం వ్యాసంలో చేరిస్తే పని అయ్యేప్పుడు దానికి నక్షత్రాలూ అవీ చేర్చనక్కరలేదు.
:ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:47, 5 ఏప్రిల్ 2021 (UTC)
 
== ట్వింకిల్ తెలుగీకరణ ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు