చంటి: కూర్పుల మధ్య తేడాలు

కథ చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
}}
'''చంటి''' 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[మీనా]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు ''చిన్నతంబి'' అనే తమిళ సినిమా మాతృక.
 
== కథ ==
నందిని ఒక జమీందారు కుటుంబంలో పుడుతుంది. వారి వంశంలో లేకలేక కలిగిన ఆడపిల్ల ఆమె. కానీ ఆమె పుట్టగానే తల్లిదండ్రులకు కోల్పోవడంతో ఆమె ముగ్గురు అన్నయ్యలు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఆమె జాతకం ప్రకారం అన్నయ్యలు నచ్చిన వ్యక్తితోకాక వేరే వ్యక్తితో పెళ్ళి అవుతుందని ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. దాంతో ఆమెకు ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా అంగరక్షకులను ఏర్పాటు చేసి పెంచుతుంటారు. అదే ఊళ్ళో పుట్టిన చంటి, ఒక అమాయకుడు. అతనికి తన తల్లి, పాటలే లోకం. ఒకసారి నందిని అంగరక్షకులతో గొడవపడ్డ చంటి వారిని కొడతాడు. దాంతో నందిని అన్నయ్యలు అతన్నే ఆమెకు అంగరక్షకుడిగా నియమిస్తారు. నందిని నెమ్మదిగా అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది.
 
== తారాగణం ==
* చంటిగా వెంకటేష్
* నందినిగా మీనా
* చంటి తల్లిగా సుజాత
* నందిని అన్నయ్యగా నాజర్
* నందిని వదినగా మంజుల
* నందిని అన్నయ్యగా వినోద్ బాల
* వంటవాడిగా బ్రహ్మానందం
* అల్లు రామలింగయ్య
 
Line 35 ⟶ 38:
* [[పావురానికి పంజరానికి పెళ్ళిచేసే పాడు లోకం]] (రచన :[[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]], గానం : ఎస్.పి.బాలు)
* [[ఓ ప్రేమా నా ప్రేమా]] (రచన : వేటూరి, గానం : ఎస్.పి.బాలు, చిత్ర)
 
==అవార్డులు==
* ఈ చిత్రంలోని పాటల్ని మధురంగా గానం చేసిన [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]కు ఉత్తమ నేపథ్య గాయకునిగా [[నంది పురస్కారం]] లభించింది.
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు