వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 866:
[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ఈ వారం వ్యాసాల పేరుమార్పు/తారకలు వగైరాలకు సంబంధించి మీ ప్రతిపాదనకు ఇక్కడ వ్యతిరేకత ఎదురైంది. ఇక్కడ గానీ, వేరే పేజీలో గానీ మీకు సమర్ధనగా ఒక్కరే రాగా, వ్యతిరేకంగా కనీసం నలుగురు మాట్లాడారు. ఇతర "ఇటీవలి మార్పులు" పేజీలో చూపించాలంటే ఈ వారం వ్యాసాలు అనే పేరుతోనే చూపించాలి, అలా చూపించవచ్చు, పేజీల్లో తారకలు పెట్టనవసరం లేదు, పెట్టరాదు అని చెప్పినప్పటికీ మీరు ప్రదర్శన వ్యాసాలు అనే పేరుతో మూసలు/తారకలు పెట్టడం మొదలుపెట్టారు. నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పాలని ఆ తరువాత ఆ ప్రమాణాలకు తూగే వాటికే తారకలు ఇవ్వాలని చెప్పినప్పటికీ, దాన్ని తూష్ణీకరించి ఇలా చెయ్యడం సరైన పద్ధతి కాదు. మీరు చేసిన పనులను వెనక్కి తిప్పమని కోరుతున్నాను. ఇటీవలి మార్పులులో "ఈ వారం వ్యాసాలు" అనే పేరుతో, ఆ వర్గం లోని పేజీలనే వాడి, చెయ్యవలసినదిగా కోరుతున్నాను. ఈ పని చేసేందుకు ఇసరికే అన్ని వనరులూ ఉన్నప్పటికీ మీరు అనుకున్న మాటే చెల్లాలని, నలుగురి వ్యతిరేకతను ఎందుకు తోసిపుచ్చుతున్నారు? అనుకున్న నాణ్యతను సాధించేందుకు మనం కృషి చెయ్యాలి. అంతే తప్ప ఉన్నవాటికే పేర్లు మార్చేసి, తారకలు పెట్టేసి ఇదే నాణ్యత అనుకుందామంటే మనలను మనమే మోసం చేసుకోవడం అవుతుంది అని గమనించండి. కనీసం నాణ్యత విషయంలోనైనా '''దయచేసి''' ''పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్'' ను అనుసరించకండి. నమస్కారం. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:29, 7 ఏప్రిల్ 2021 (UTC)
 
:ప్రయోగాత్మకం అంటూ ప్రతిపాదించిన తారను ఒకటి తయారుచేసి బాలాంత్రపు రజనీకాంతరావు అన్న వ్యాసపేరుబరి పేజీలో {{Ping|Arjunaraoc}} గారు చేర్చేశారు. ఒకపక్క చర్చ జరుగుతున్నప్పుడు, చర్చలో చాలామంది మౌలికంగా అసలు నాణ్యతలో చాలా ఎగుడుదిగుళ్ళు ఉన్న ఇలాంటి పేజీలకు తారలే ఇవ్వవదన్న సూచన చేస్తున్నప్పుడు ఈ ప్రయోగం సరికాదు. ఒకవేళ అందరూ ఒక ఆలోచన బావుందనీ, కాకుంటే అది అమలు ఎలా ఉంటుందో తెలియదనీ అభిప్రాయపడితే అప్పుడు ప్రయోగం చేసి చూడడంలో అర్థం ఉంది కానీ ఇక్కడ ఆ ఆలోచనే సరికాదని అత్యధికులు చెప్తూ ఉంటే ప్రయోగం పేరిట ఇదంతా చేయడం సరికాదు. పైన చర్చలోనే {{Ping|Chaduvari}} గారు దీన్ని గుర్తించి ఈ పద్ధతి సరికాదనీ, ఈ ధోరణిలో పోవద్దనీ అర్జున గారిని కోరుతూ రాశారు. అంతేగాక, చర్చలో పాల్గొన్నవారిలో ఒక్కరు తప్ప మరెవ్వరూ ఈవారం వ్యాసాలకు అలాంటి తారలు ఇవ్వడాన్ని సూత్రప్రాయంగా కూడా అంగీకరించలేదు. అలాంటప్పుడు ప్రయోగం దేనికి? ఈ పద్ధతి సరికాదు కాబట్టి బాలాంత్రపు రజనీకాంతరావు, జల వనరులు వ్యాసంలో తారచేరుస్తూ ఆయన చేసిన మార్పును తిరగకొట్టాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:15, 7 ఏప్రిల్ 2021 (UTC)
 
== ట్వింకిల్ తెలుగీకరణ ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు