పరమహంస యోగానంద: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 58:
=== 1935-36 భారతదేశ పర్యటన ===
1935 లో యోగానంద ఇద్దరు పాశ్చాత్య శిష్యుల్ని తీసుకుని భారతదేశానికి ఓడ ద్వారా వచ్చి తన గురువు శ్రీయుక్తేశ్వర్ గిరిని కలుసుకున్నాడు. ఆయన ఆశీర్వాదంతో భారతదేశంలో కూడా యోగదా సత్సంగ సొసైటీని నెలకొల్పాలన్నది యోగానంద ఆశయం. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కిన ఓడ యూరోప్, మధ్య ప్రాచ్యంలోని ప్రాంతాలన్నీ చుట్టుకుని వచ్చింది. దీన్ని అవకాశంగా చేసుకుని ఆయన పాశ్చాత్య సాధువులైన థెరిసా నాయ్‌మన్ లాంటి వారిని కలిశాడు. సెయింట్ ఫ్రాంసిస్ గౌరవార్థం, ఇటలీలోని అసిసి, గ్రీస్ దేశంలోని అథీనియన్ దేవాలయాలు, సోక్రటీసు మరణించిన జైలు, పాలస్తీనాలోని పవిత్ర ప్రదేశాలు, జీసస్ తిరిగిన ప్రదేశాలు, ఈజిప్టు లోని మహా పిరమిడ్లు మొదలైన వాటిని సందర్శించాడు.<ref name="autob2"/><ref>{{cite book|title=The Second Coming of Christ (book) / Volume I / Jesus Temptation in the wilderness / Discourse 8 / Mattew 4:1–4|last=Yogananda|first=Paramahansa|publisher=Self-Realization Fellowship|year=2004|isbn=9780876125557|pages=166–167}}</ref>
 
1935 ఆగస్టున ఆయన ఎక్కిన ఓడ బొంబాయి తీరాన్ని చేరుకుంది. అమెరికాలో ఆయనకు దక్కిన ఆదరాభిమానాలను చూసి ఆయన దిగిన తాజ్ మహల్ హోటల్ కు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు, విలేకరులు ఆయనను కలవడానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన తూర్పువైపు వెళ్ళే రైలు మార్గాన కలకత్తాకు సమీపంలోని హౌరా స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ ఆయన సోదరుడు బిష్ణు చరణ్ ఘోష్, కాశింబజార్ మహారాజా, ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరాంపూర్ చేరుకుని తన గురువును ఆత్మీయంగా కలుసుకున్నాడు. ఈ వివరాలను యోగానంద పాశ్చాత్య శిష్యుడైన సి. రిచర్డ్ రైట్ విపులంగా గ్రంథస్తం చేశాడు.<ref name="autob2" /> ఆయన భారతదేశంలో ఉండగానే రాంచీ పాఠశాలను చట్టబద్ధంగా నమోదు చేయించాడు. ఒక పర్యటన బృందంతో కలిసి [[ఆగ్రా]]లోని [[తాజ్ మహల్]], [[చాముండేశ్వరి దేవాలయం, మైసూరు| మైసూరు లోని చాముండేశ్వరి దేవి ఆలయం]], 1936 జనవరిలో [[అలహాబాదు|అలహాబాద్]] లో జరిగిన [[కుంభ మేళా|కుంభమేళా]], లాహిరీ మహాశయుల శిష్యుడైన కేశవానందను కలుసుకోవడానికై బృందావనం మొదలైన ప్రదేశాలను సందర్శించాడు.<ref name="autob2" />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరమహంస_యోగానంద" నుండి వెలికితీశారు