పరమహంస యోగానంద: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎అమెరికాలో బోధనలు: మరికొన్ని లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 52:
1920 ఆగస్టున బోస్టన్ వెళ్ళే ''ద సిటీ ఆఫ్ స్పార్టా'' అనే నౌకను ఎక్కాడు. ఈ నౌక సుమారు రెండు నెలలు ప్రయాణించి సెప్టెంబరులో [[బోస్టన్]] నగరం చేరుకుంది.<ref name="Melton">{{cite book |last=Melton, J. Gordon|first=Martin Baumann|title=Religions of the World: A Comprehensive Encyclopedia of Beliefs and Practices |year=2010|publisher=ABC-CLIO|isbn=9781598842043 }}</ref> అక్టోబరు మొదట్లో ఈయన అంతర్జాతీయ మత సభల్లో ప్రసంగించాడు. అది సభికులను బాగా ఆకట్టుకుంది. తర్వాత సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలు, యోగా తత్వం, ధ్యాన సాంప్రదాయాలను ప్రచారం చేయడం కోసం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను ప్రారంభించాడు.<ref name="DENNIS HEVESI">{{cite news |author=Hevesi, Dennis | title=Sri Daya Mata, Guiding Light for U.S. Hindus, Dies at 96 | location=New York, NY | newspaper=New York Times| date= December 3, 2010 | url=https://www.nytimes.com/2010/12/03/us/03mata.html?_r=0 }}</ref> యోగానంద తర్వాతి నాలుగు సంవత్సరాలు బోస్టన్ లో గడిపాడు. ఆ మధ్యకాలంలోనూ తూర్పు తీరంలో ప్రసంగాలు చేశాడు.<ref>Boston Meditation Group Historical Committee. ''In The Footsteps of Paramahansa Yogananda: A guidebook to the places in and around Boston associated with Yoganandaji''</ref> 1924 లో సందేశాలిస్తూ ఖండాంతర పర్యటనలు చేశాడు.<ref>Sister Gyanamata "God Alone: The Life and Letters of a Saint" p. 11</ref> ఆయన సభలకు వేలాదిమంది తరలివచ్చేవారు.<ref name="autob2" /> ఈ సమయంలో ఆయన అనేక మంది సెలెబ్రిటీలను కూడా ఆకర్షించాడు. 1925లో ఆయన కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ తరఫున ఒక అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఇది తాను విస్తృతంగా చేపట్టబోయే కార్యక్రమాలకు పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకుంది.<ref name="Melton" /><ref>{{cite book |last=Lewis Rosser |first=Brenda |title= Treasures Against Time|year=1991 |publisher=Borrego Publications |isbn=978-0962901607|page=Foreword p. xiii}}</ref> తమ జీవిత కాలంలో అమెరికాలో ఎక్కువ భాగం గడిపిన హిందూ ఆధ్యాత్మిక గురువుల్లో యోగానంద ప్రథముడు. ఆయన అక్కడ 1920 నుంచి 1952లో మరణించే దాకా ఉన్నాడు. మధ్యలో 1935-36 లో మాత్రం ఒకసారి భారతదేశానికి వచ్చి వెళ్ళాడు. తన శిష్యుల సహకారంతా ప్రపంచమంతా క్రియా యోగ కేంద్రాలను నెలకొల్పాడు.
 
భారతదేశంలో బలపడుతున్న [[భారత స్వాతంత్ర్యోద్యమము|స్వాతంత్ర్యోద్యమం]] దృష్ట్యా ఆయన మీద అమెరికాకు చెందిన ఎఫ్.బి.ఐ, బ్రిటిష్ ప్రభుత్వాలు నిఘా ఉంచాయి.<ref>{{Cite web|url=https://www.huffpost.com/entry/why-yogananda-was-before_n_6006756|title=The Best Yoga Film of 2014: Get a Sneak Peak Here|date=October 20, 2014|website=HuffPost|language=en|access-date=May 8, 2019}}</ref> ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింతగా అనిపిస్తుండటతో 1926 నుంచి 1937 మధ్యకాలంలో ఆయన మీద రహస్యంగా కొన్ని దస్త్రాలు కూడా తయారు చేయబడ్డాయి.<ref>{{Cite book|url=https://catalog.archives.gov/id/2678849|title=Confidential File on Swami Yogananda, Alleged Hindu Religious Leader, Whose Fraudulent and Moral Practices Rendered Him an Undesirable Alien, from 1926–1937|last=National Archives Catalog, Department of Commerce and Labor. Bureau of Immigration and Naturalization. 1906–1913 and 1913-6/10/1933 (Predecessor) & 1893 – 1957|series=Series: Subject and Policy Files, 1893 – 1957}}</ref> యోగానంద కూడా అమెరికాలో వేళ్ళూనికున్న సంచలనాత్మక మీడియా, మత మౌఢ్యం, జాతి వివక్ష, పితృస్వామ్యం, లైంగిక ఆరాటం లాంటి లక్షణాలపై వ్యతిరేకంగా ఉన్నాడు.<ref name = Phil/>
 
1928లో మయామీలోని[[మయామీ]]లోని పోలీసు అధికారి లెస్లీ కిగ్స్ ఆయన కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆయనకు కొంత ప్రతికూలత ఎదురైంది. అయితే తనకు యోగానంద మీద వ్యక్తిగత ద్వేషమేమీ లేదనీ ఇది ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సంరక్షణ కోసం ఇంకా, యోగానంద రక్షణ కోసమఏ అలా చేయవలసి వచ్చిందని కిగ్స్ తెలిపాడు. యోగానందకు వ్యతిరేకంగా కొన్ని అనామక బెదిరింపులు వచ్చినట్లు కూడా తెలియజేశాడు.<ref>Biography of a Yogi(2017), by Anya Foxan, pg 106-108</ref> ఫిల్ గోల్డ్‌బెర్గ్ ప్రకారం మయామీ అధికారులు ఈ విషయంపై బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఒకానొక కాన్సులేట్ అధికారి ప్రకారం మయామీ అధికారి కిగ్స్ యోగానంద బ్రిటీష్ రాజ్య పౌరుడిగా, చదువుకున్న వాడిగానూ గుర్తించాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన శరీరం రంగు పట్ల ఆ ప్రాంతపు ప్రజల్లో వివక్ష ఉందనీ, ఆయన మీద భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.<ref name = Phil/>
 
=== 1935-36 భారతదేశ పర్యటన ===
"https://te.wikipedia.org/wiki/పరమహంస_యోగానంద" నుండి వెలికితీశారు