"ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

(కొత్త పేజీ: హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన '''ఖైరతాబాదు ...)
 
[[హైదరాబాదు]] జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన '''ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.
==2008 ఉప ఎన్నికలు==
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప [[లోక్‌సత్తా పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు [[తెలుగుదేశం పార్టీ]] పోటీకి దిగలేదు.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/316975" నుండి వెలికితీశారు