సంకుసాల నృసింహకవి: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{వికీకరణ}}{{సమాచారపెట్టె వ్యక్తి | name = సంకుసాల నృసింహకవి | residence =...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
(తేడా లేదు)

13:20, 15 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

సంకుసాల నృసింహకవి క్రీ.శ.14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయన రచించిన కవి కర్ణరసాయనము అనే ప్రౌఢ ప్రబంధ కావ్యము ప్రసిద్ధమైన రచన.

సంకుసాల నృసింహకవి
జననంక్రీ.శ.14వ శతాబ్దం.
మరణ కారణంసహజ మరణం
నివాస ప్రాంతంకడప జిల్లా.
ఇతర పేర్లుసంకుసాల నరసింహకవి
వృత్తికవి
ప్రసిద్ధికవికర్ణరసాయనము.
జీతంజీతం
పదవి పేరుకవికర్ణరసాయనము కర్త
మతంహిందూ

జీవిత విశేషములు

సంకేసుల అన్న ఊరిపేరు ఈతని ఇంటిపేరుగా మారిందని నానుడి.రాయలసీమలో ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాలలో సుంకసాల అనే పలు గ్రామాల పేర్లు ఇప్పటికీ ఉన్నాయి.వీటిలో ఈతను ఏ సంకేసులకు చెందినవారో అను చెప్పటం కష్టము.కడప జిల్లా పులివెందుల తాలూకాలోని సుంకేసులే కవి గ్రామము అని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు నిర్ణయించారు.దీనికి ఆధారం ఈగ్రామ నృసింహాలయ ప్రాకారంలో ఉన్న దాన శాసనాన్ని వివరిస్తూ కవికర్ణరసయన ఇవ్వబడిన దానముగ పేర్కొనబడినది. సంకుసాల నరసింహకవి అని కొందరు ఈయని ఉదహరించటం జరిగినది. ఈయనే తాళ్ళపాక అన్నమాచార్యుల కుమారుడని లోకంలో ఒక నమ్మకం కుదురుకున్నది.దీనికి కూడా వేటూరి వారి అన్నమాచార్య చరిత్ర లో రెండు ఆధారాలు చూపించారు. ఒకటి తెనాలి రామకృష్ణకవి చాటువు రెండవది తాళ్ళపాక చిన్నన్న కృత అష్టమహిషీ కల్యాణం అనేపీఠిక. ఈయన శ్రీ కృష్ణదేవరాయలకు సమకాలికుడని చాలామంది విమర్సకులు అంగీకరిస్తే రాళ్ళపల్లి అనంతకృష్ణశాస్త్రిగారు ఈయన క్రీ.శ.14వ శతాబ్దమునకు చెందినవారని ఈయను తాళ్ళపాక అన్నమాచార్యకు సంబంధములేదని ఈయని పలు నిరూపణలు చేసినారు.

ఈయన వ్రాసిన ప్రఖ్యాత ప్రౌఢ ప్రబంధ రచన కవి కర్ణరసాయనము. ఇది అల్లసాని పెద్దన వ్రాసిన మను చరిత్రము వలె ఒక ప్రబంధ రచన. నృసింహకవి తా నేశాఖాబ్రాహ్మణుఁడైనదిగానీ లేక బ్రాహ్మణుఁడైనదిగానీ ఎక్కడా పేర్కొనలేదు. అందువలన నృసింహకవి యేవర్ణస్థుఁ డైనదియును చెప్పుటకు వీలులేదు. ఇతడు బ్రాహ్మణు డనియు నియోగి యనియు లోకములో నున్న వాడుకనే నమ్మవలసినదే.ఇది చెప్పుటకు తన రచనలో కల ఇష్టదేవతాస్తోత్రపాఠములను బట్టి నిర్ణయించెదరు. అందులో మొదట విష్ణుని, పిమ్మట బ్రహ్మను, శంకరుని, వినాయకుని, సరస్వతిం బ్రార్థించె. ఇది స్మార్తులుగానుండుబ్రహ్మక్షత్రియులు చేయుస్తోత్ర ప్రక్రియ యై యున్నది. కాని భట్టు పరాశర శిష్యుండ నై చెప్పుటంజేసి యితఁడు నల్లసాని పెద్దనవలె స్మార్తుడై వుండవచ్చును. వైష్ణవేష్టి చేసికొని రామానుజసిద్ధాంతప్రధానుఁ డై యుండిననియోగి యని అని మరికొందరి అభిప్రాయము.

మూలములు

  • 1981 భారతి మాసపత్రిక. వ్యాసము:సంకుసాల నరసింహకవి కొన్ని చారిత్రక సత్యములు. వ్యాసకర్త:డా.జి.చలపతి.
  • కవి కర్ణరసాయనము.