సంకుసాల నృసింహకవి: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{వికీకరణ}}{{సమాచారపెట్టె వ్యక్తి | name = సంకుసాల నృసింహకవి | residence =...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 41:
 
ఈయన వ్రాసిన ప్రఖ్యాత ప్రౌఢ ప్రబంధ రచన '''కవి కర్ణరసాయనము'''. ఇది అల్లసాని పెద్దన వ్రాసిన మను చరిత్రము వలె ఒక ప్రబంధ రచన. నృసింహకవి తా నేశాఖాబ్రాహ్మణుఁడైనదిగానీ లేక బ్రాహ్మణుఁడైనదిగానీ ఎక్కడా పేర్కొనలేదు. అందువలన నృసింహకవి యేవర్ణస్థుఁ డైనదియును చెప్పుటకు వీలులేదు. ఇతడు బ్రాహ్మణు డనియు నియోగి యనియు లోకములో నున్న వాడుకనే నమ్మవలసినదే.ఇది చెప్పుటకు తన రచనలో కల ఇష్టదేవతాస్తోత్రపాఠములను బట్టి నిర్ణయించెదరు. అందులో మొదట విష్ణుని, పిమ్మట బ్రహ్మను, శంకరుని, వినాయకుని, సరస్వతిం బ్రార్థించె. ఇది స్మార్తులుగానుండుబ్రహ్మక్షత్రియులు చేయుస్తోత్ర ప్రక్రియ యై యున్నది. కాని భట్టు పరాశర శిష్యుండ నై చెప్పుటంజేసి యితఁడు నల్లసాని పెద్దనవలె స్మార్తుడై వుండవచ్చును. వైష్ణవేష్టి చేసికొని రామానుజసిద్ధాంతప్రధానుఁ డై యుండిననియోగి యని అని మరికొందరి అభిప్రాయము.
 
ఈకవి కర్ణరసాయనము కావ్యానికి ఇప్పటివరకు మూడు ముద్రితప్రతులు ఉన్నాయి. 1.పువ్వాడ వేంకటరావు పంతులు వర్తమాన తరంగిణీ ముద్రాక్షరశాలలో ముద్రించిన మొదటి ప్రతి (1885). 2.ఉత్పల వేంకటనరసింహాచార్యులచే పరిష్కరించబడిన వావిళ్ళ వారి రెండవప్రతి (1916). 3. మోచర్ల రామకృష్ణయ్య సంపాదకవిత్వంలో వెలువడిన సాహిత్య అకాడమీ ప్రతి మూడవది(1967). మొదటి ప్రతిలో సంకుసాల అనిలేదు.రెండు మూడు ప్రతుల్లో సంకుసాల నరసింహకవి అనే ఉంది. [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గారు అన్నమాచార్య చరిత్రకు వ్రాసిన పీఠికలో లక్షణకర్తలు తమ లక్షణ గ్రంధాల్లో కవి కర్ణరసాయన పద్యాలను లక్ష్యాలుగా వాడుకున్న సందర్భాలలో ఇతనిని సుంకసాల నరసింగన్న అని పేర్కొన్నట్లు వ్రాసారు. ఈకావ్య మొదటి ముద్రిత ప్రతికి రెండవ ముద్రిత ప్రతికి మధ్యకాలంలో [[కందుకూరి వీరేశలింగం పంతులు]] గారు '''కవుల చరిత్ర''' అనే ద్వితీయ సంపుటం (1887)లో ఈకవిని సంకుసాల నరసింహకవిగానే పేర్కొనినారు. అంతే కాక ఈ కావ్యానికి జూలూరి అప్పయ్య పండితుడు వ్రాసిన వ్యాఖ్యానము మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారములో (D 453, 454) లో ఉంది.
 
===మూలములు===
"https://te.wikipedia.org/wiki/సంకుసాల_నృసింహకవి" నుండి వెలికితీశారు