గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
28. తెలుగునాడు-అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస,2021-17-04,76,1974.
 
== గ్రంధచౌర్యం గుర్తింపు సాధనాలు ==
సమాచార పరిశ్రమలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైజ్ఞానిక సాహిత్యం ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడుతోంది, ఇంటర్నెట్ ద్వారా లభిస్తుంది. వెలికి చూస్తున్న ప్లగారిజం సంఘటనల తీవ్రత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నందున, నిధులు సమకూర్చే సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రచురణకర్తలు పరిశోధనా పత్రాలు, నివేదికలు, సిద్ధాంత గ్రంధాలు మొదలైన వాటికి ప్లగారిజం అంచనా కోసం యాంటీ-ప్లగారిజం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వంటి చర్యలకు పట్టుబట్టడం అనివార్యంగా మారింది. కాబట్టి, అంతర్జాలంలో ప్రచురించిన సాహిత్యం, అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ ప్రతులను  అంటే ఇప్పటికే ప్రచురించబడిన పూర్తి వ్యాసాలు, పుస్తకాలు, పత్రాలు, సారాంశాలు, బిబ్లియోగ్రఫిక్ రికార్డులతో సారూప్యతను కనుగొనడానికి శోధించి (ఆన్‌లైన్‌లో క్రాల్ చేసి) ‘ప్లగారిజం’ గుర్తించే వ్యవస్థలను (సాధనాలను) అభివృద్ధి చేయడం కూడా సమాచార పరిశ్రమకు సాధ్యమైంది. ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలలో సమర్పించిన (అప్‌లోడ్ చేసిన) వ్రాతప్రతిని (మాన్యుస్క్రిప్ట్‌ను) శోధించి వారి నివేదికల ద్వారా సారూప్యతను, మూలాలను సూచించుటే కాకుండా, గుర్తించడానికి, సరిపోల్చడానికి వీలుగా శాతం లెక్కించి సూచిస్తుంది.
 
=== ఉచిత సాధనాలు ===
వెబ్ ఆధారిత కంటెంట్, స్వేచ్ఛా వనరుల సారూప్యతను గుర్తించడానికి నమోదు చేయడముతో ఇంటర్నెట్ లో చాలా సాధనాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
 
* ప్లగారిజం చెకర్
* వైపర్
* డుప్లి చెకర్
* కాపీ లీక్స్
* పేపర్ రేటర్
* ప్లాగియారిస్మా
* ప్లేగ్ ట్రాకర్
* క్యుటెక్ష్ట్
* ప్లగారిజం హంట్
* ప్లాగ్ స్కాన్
* గ్రామర్ లీ  మొదలగునవి.
 
ఇవి అంతర్జాలంలో ఉచితంగా లభించే లైసెన్స్ పరిమితులకు లోబడని విషయాన్ని స్వేచ్ఛా వనరులని మాత్రమే శోధించుతాయి.  విద్యార్దులు తమ వ్రాత ప్రతిని తయారు చేయడములోని మొదటి దశలలో వీటిని ఈ సాధనాలను వినియోగించి లభ్ఢి పొందవచ్చు.  
 
=== వాణిజ్య సాధనాలు ===
అయితే ఈ స్వేచ్ఛా వనరులతో పాటు లైసెన్స్ పొందిన డేటాబేసులు, పత్రికలు, వ్యాసాలు, విద్యార్ధుల భాండాగారాలకు (స్టూడెంట్ రిపోజిటరీ) అప్‌లోడ్ చేసిన ప్రతులను సమగ్రంగా తనిఖీ చేయడానికి ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలు (డిటెక్షన్ సిస్టమ్స్) వాణిజ్యపరంగా అందుబాటులో ఉద్భవించాయి (ఉదా).
 
టర్నిటిన్,
 
ఐథెంటిక్,
 
గ్రామర్ లీ,
 
ఊర్కుండ్ మొదలగునవి.
 
కంటెంట్ భాగస్వామ్యాలయిన ప్రముఖ ప్రచురణకర్తల లైసెన్స్ జర్నల్స్, వ్యాసాలు, చందా ఆధారిత తాజా/పూర్వ ప్రతుల ప్రచురణలు.  130 మిలియన్లకు పైగా వారి ఉచిత వ్యాసాలు లైబ్రరీ డేటాబేస్‌లు, టెక్స్ట్-బుక్, డిజిటల్ సేకరణలు,  ఉదాహరణకు, సేజ్, ఎమరాల్డ్, ఎబ్స్కో హొస్ట్, క్రాస్ రిఫరెన్సె ఆర్గ్ (Crossreference.org), గేల్, ది స్టూడెంట్ రూమ్ గ్రూప్ మొదలగునవి తనిఖీ చేస్తాయి.
 
ఈ సాధనాలు రోజుకు 50% పైగా ప్లగారిజం  డేటాబేసుకు మిలియన్లకు పైగా విద్యార్థులు సమర్పించిన పేపర్లను  కూడా జోడించి అంచనా వేయబడుతుంది.
 
ఇంటర్నెట్ వెబ్ క్రాలర్, ప్రస్తుత వెబ్ నుండి బిలియన్ వెబ్ పేజీలతో పాటు ఆర్కైవ్ చేసిన వెబ్ పేజీల సూచికలను క్రాల్ చేస్తుంది.
 
సాధారణంగా ఈ అధునిక సాధనాలు ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు.  వీటిలో కూడా ముఖ్యంగా తమ విద్యార్ధులు సమర్పించే డేటాబేస్ అనుసరించి, నివేదికల రూపము లోను కొంత వైవిధ్యము సహజముగానే ఉంటుంది.
 
=== పరిమితులు ===
అయితే ఈ సాధనాలు వినియోగంలోను కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి -
 
·        అచ్చు ఫార్మాట్‌లో మాత్రమే ప్రచురించబడిన విషయం ఆన్‌లైన్ ప్లగారిజం డిటెక్షన్ సిస్టమ్స్ ద్వారా ధృవీకరించబడదు.
 
·        చర్చలు, సమావేశాలు, సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లు లేదా సింపోసియాలో చర్చించబడిన / సమర్పించబడిన ఆలోచనలను  తమ రచనలలొ తీసుకొన్నప్పటికిని వాటిని గుర్తించలేము.
 
·        స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ, సమర్పించిన వచనం అటువంటి చిత్ర (ఇమేజ్) ఆకృతులలోని కంటెంట్‌ను సరిపోల్చదు.