ఉన్నత విద్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
రోమన్ సామ్రాజ్యము పతనమయ్యాక గ్రీకులు నివసించే ప్రాంతమంతా బైజంటైన్ రాజ్యంగా ఏర్పడింది. లాటిన్ ప్రబలంగా ఉన్న పశ్చిమభాగమంతా జర్మన్ జాతీయుల ఆధీనమైనది. పశ్చిమ ప్రాంతాలలో లాటిన్-జర్మన్ సంస్కృతుల సంయోగం జరిగినప్పటికీ, రోమనుల సాంస్కృతిక, రాజకీయ, విద్యావ్యవస్థలు జర్మన్ ల కాలంలో దెబ్బతిన్నవి. 12వ శతాబ్దమువరకు ఈవ్యవస్థలు తిరిగి కోలుకోలేదు. అదేసమయంలో మధ్యధరా, తదితర తూర్పు ప్రాంతాలలో మాత్రము పాండిత్యం, విద్య భాగా వర్ధిల్లినది. బైజంటైన్ రాజధాని కాంస్టాట్ నోపుల్. సాంప్రదాయాలు, ఉన్నత విద్యా విధానం ఇక్కడ యధాతధంగా కొనసాగినది.క్రీ.శ.425లో 5వ థియొడొసియస్ అనేరాజు ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం మిచ్చి, పోషించినట్లు ఆధారాలున్నవి.కాంస్టాట్ నోపుల్ లో లాటిన భాషకు 3, లాటిన వ్యాకరణానికి 10, గ్రీకు భాషకు 5, గ్రీకు వ్యాకరణానికి 10 పీఠాలు నెలకొల్పి తత్త్వ విచారానికి ఒక ఆచార్యానుని, న్యాయశాస్త్రంలో ఇద్దరు ఆచార్యులకు జీతభత్యాలు చెల్లించినట్లు తెలుస్తున్నది. ఇక్కడే విశ్వవిద్యాలయ వ్యవస్థకు పునాదులు పడినవి.ఇది ఎప్పుడు ఖచ్చితంగా ఏర్పడినదనేది చెప్పడం కష్టం. 7వ శతాబ్దంలోని పాఠ్య ప్రణాళికాల్లో వ్యాకరణం, సాహిత్యం, తర్కం, అలంకారం, తత్త్వ విచారం, ఖగోళం, గణితం పేర్కొనబడినవి. క్రీ.శ.863లో విజ్ఞానశాస్త్రాలకు బాగా ప్రోత్సాహం లభ్యమైనది.క్రీ.శ.1045లో 9వ కాంస్టాంటైన్ అనేరాజు ఈవిశ్వవిద్యాలయాన్ని న్యాయశాస్త్ర విభాగం, తత్త్వ విచార విభాగం అని రెండుగా విభజించాడు.బాగ విద్యావంతులు, శిక్షితులు అయిన ప్రభుత్యోగులను పొందేటందుకు ఈ సంస్కరణ తెచ్చినట్లు చెప్పబడినది. మత విషయాల బోధనకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు.లాంచనము, వ్యవస్థీకృతము అయినా విద్యాబోధన ఎల్లప్పుడూ జరగకపోయినా, లియో నైసిఫరోస్, ప్లిథాన్, బెస్సరియన్ అనేమహామేధావులు ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేసినట్లు ఆధారాలున్నాయి.
 
7వ శతాబ్దంలో తురుష్కులు రంగప్రవేశం చేయటంతో, పూర్వ రోమన్ సామ్రాజ్యము మూడు ముక్కలైనదుముక్కలైనది. తూర్పు గ్రీక్ బైజంటైన్ ప్రాంతము, పశ్చిమ లాటిన్ జర్మన్ ప్రాంతము, అరేబియన్ ఇస్లామిక్ ప్రాంతము.ఉన్నత విద్యకు సంబంధించి తురుష్కులు రెండు మంచిపనులు చేసారు.ఒకటి అనువదాలను ప్రోత్సహించడము, రెండు, అనేక స్వంత రచనలు చేయడం. 9వ శతాబ్దములో బాగ్దాద్ విజ్ఞాన కేంద్రముగా మారినది. అలానే ఉత్తర ఆఫ్రికాలో బాగ్దాద్ మాదిరి విద్యా విధానం ఏర్పడింది.తురుష్కుల తరువాత వచ్చిన షియా-సున్నీ వివాదము వారి విద్యా సంస్థలపై కూడా ప్రభావం చూపింది.షియాలు మాత్రమే విజ్ఞాన శాస్త్రాలకు, గణితానికి ప్రాముఖ్యత నిచ్చారు. మొత్తంమీద, ఇస్లామిక్ ప్రపంచం మధ్య యుగంలో అల్రజ్వ, అల్ ఫరాబి, ఇబన్ సివా, ఇబన్ రుషాద్ మొదలైన మేధావులను తయారుచేసినది. వీరె తరువాత కాలంలో క్రైస్తవ విశ్వవిద్యాలయాలకు పునాదులు అయినాయి.
 
పశ్చిమ ఐరోపా చరిత్రలో 11, 12, 13వ శతాబ్దాలు పేర్కొనదగినవి. ఈకాలంలోనే నగరీకరణం, వర్తకం బైజంటైన్-తురుష్క రాజ్యాలమధ్య సంబంధాలు, సాంస్కృతకార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందాయి.చర్చి ప్రాముఖ్యత పెరగడం, చర్చి అవసరాలకు, యోగ్యులైన చర్చి ఉద్యోగుల కోసం అనేక విద్యాలయాలు ఏర్పడినవి.ఫలితంగా విజ్ఞానం పెరిగి, మహాకావ్యాలపట్ల జనంలో ఆసక్తి పెరిగింది.శాస్త్రీయ పరిశోధనలో ప్రవేశం, రోమన్ న్యాయశాస్త్రం పట్ల మొజు పెరిగింది. అంతర్జాతీయంగా చర్చి పాఠశాలలు విద్యార్ధులను ఆకర్షించినవి. 14-17 శతాబ్దాల మధ్య ఐరోపాలో అనేక మార్పులు వచ్చినవి. జనజీవనంలో తొలి మధ్యయుగపు లక్షణాలు క్రమీణ క్షీణించడం, '''రినైసన్స్''' తలెత్తడము, క్రైస్తవ ప్రపంచం ప్రాటెస్టెంట్, కేధలిక్ అని రెండుగా చీలడం, సంస్కరణ, ప్రతికూల-సంస్కరణోద్యమాలు ఉత్పన్నం గావడం జరిగినవి. 14-15వ శతాబ్దాలు ఐరోపాలో నూతన విశ్వవిద్యాలయాల స్థాపనకు ఎంతో ఫలమంతమైన కాలంగా పరిగణించబడినవి. ఇదేసమయంలో మత విషయాలకు విశ్వవిద్యాలయాలన్నింటిలో అధికప్రాముఖ్యత ఇవ్వడంచేత, ఈకాలంలో శాస్త్రీయమైన పరిశోధనలకు తగిన మద్దతుగాని,ప్రోత్సాహం లభించలేదనే చెప్పవచ్చును.
 
 
 
==కళాశాల విద్య ==
"https://te.wikipedia.org/wiki/ఉన్నత_విద్య" నుండి వెలికితీశారు