సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: ఆరోపణలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తీసివేత
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
 
== కాలరేఖ ==
తన ఆత్మాహుతికి వారం రోజుల ముందు నుండి సుషాంత్ మూడు విషయాలపై పలుమార్లు గూగుల్ లో వెదికాడు. మొదటి విషయం దిశా సలియాన్ (తన కంటే వారం రోజులు ముందుగా మరణించిన తన మేనేజర్) కాగా, రెండవది తనపై వచ్చిన వార్తలు మరియు, మూడవది మానసిక వ్యాధులు.<ref>[https://indianexpress.com/article/cities/mumbai/before-suicide-sushant-singh-rajputs-google-search-his-name-manager-illness-6536412/ ఆత్మాహుతికి ముందు సుశాంత్ ప్రవర్తన]</ref>
 
* '''13 జూన్'''
పంక్తి 8:
 
* '''14 జూన్ '''
మధ్య రాత్రి గం| 2:00 ప్రాంతంలో బాలీవుడ్ నటి [[రియా చక్రవర్తి]] కి ఒక మారు, టీవీ నటుడు మహేశ్ షెట్టి కి ఒక మారు ఫోన్ కాల్ చేశాడు. రెండింటిలో వేటికి సమాధానం రాలేదు. ఉదయం తొందరగానే నిద్రలేచి కాసేపు తర్వాత స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధుల గురించి మరియు, పెయిన్ లెస్ డెత్ (బాధ లేని మరణం) గురించి గూగుల్ లో వెదికాడు <ref>[https://www.dnaindia.com/bollywood/report-exclusive-sushant-singh-rajput-did-not-party-at-home-or-go-outside-on-june-13-househelp-tells-bihar-police-2835054 ఆ రోజు త్వరగానే నిద్రలేచిన సుశాంత్]</ref> <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/what-sushant-singh-rajput-googled-before-his-death-schizophrenia-bipolar-disorder-painless-death-1707271-2020-08-03 మానసిక వ్యాధుల గురించి గూగుల్ శోధించిన సుశాంత్] </ref>.
 
తన సోదరితో గం| 9:00 ప్రాంతంలో మాట్లాడాడు. మరొక గంట గడచిన తర్వాత పళ్ళరసం తీసుకొని, తాను వేసుకొనవలసిన మందు బిళ్ళలను వేసుకొన్నాడు.
పంక్తి 17:
 
* '''05 సెప్టెంబరు '''
ఈ కేసును మూడు సంస్థలు దర్యాప్తు చేస్తున్నవి. అవి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో <ref>[https://www.thehindu.com/news/national/sushant-singh-rajput-life-and-death-in-the-spotlight/article32526228.ece సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న మూడు సంస్థలు] </ref>
 
== ఆరోపణలు ==
రియా మరియు, ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్ కు సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలను వాడుకోవాలని చూశారని సుశాంత్ తండ్రి ఆరోపించారు. సుషాంత్ కు నమ్మకంగా పనిచేసే అతని పనివారిని రియా/ఆమె కుటుంబ సభ్యులు మార్చివేశారని, 15 కోట్ల రూపాయలను సుషాంత్ బ్యాంకు ఖాతా నుండి తమ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకొన్నారని, మానసిక రుగ్మతలకు నివారణగా వాడుతోన్న ఔషధాలను మితి మించి వాడేలా చేశారని, తాము చెప్పినట్లు వినకపోతే సుషాంత్ కు ఉన్న "పిచ్చి" కి సంబంధించిన మెడికల్ రికార్డులను బట్టబయలు చేస్తామని బెదిరించి ముంబైని విడిచి కూర్గ్ కు వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్న సుషాంత్ ఆశలను అడియాసలు చేశారని సుశాంత్ తండ్రి కె కె సింఘ్ అరోపించారు.
 
== విచారణ ==
పంక్తి 31:
మొదట సుశాంత్ బాత్ రోబ్ (స్నానానికి ముందు/తర్వాత ధరించే కోటు లాంటిది) యొక్క బెల్టుతో ఉరి వేసుకోవటానికి ప్రయత్నించాడు అని, కాని అతని బరువును అది మోయలేకపోవటంతో తన కుర్తాతో ఉరి వేస్కొన్నాడని పోలీసులు తెలిపారు. వస్త్రాలన్నీ సుశాంత్ బెడ్ రూంలో చిందర వందరగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.<ref> [https://www.mid-day.com/articles/sushant-singh-rajput-case-did-the-actor-try-to-hang-self-with-bathrobe-belt-first/22861234 ఉరి పోసుకొన్న సమయంలో సుశాంత్ ఎలాంటి పెనుగులాట చేయలేదు]</ref>
 
25 జూలై న సుశాంత్ తండ్రి కె.కె సింగ్ తను నివసించే పట్టణం [[పాట్నా]] లో రియా మరియు, ఆరుగురు ఇతరులు (రియా కుటుంబ సభ్యుల) పై సుశాంత్ ను ఆత్మాహుతికి ప్రేరేపించినట్లు FIR దాఖలు చేసారు.<ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-enforcement-directorate-books-rhea-chakraborty-6532733/ రియా చక్రబొర్తి యే తమ కుమారుడిని ఆత్మాహుతికి ప్రేరేపించింది అని సింగ్ FIR]</ref> ఈ FIR లో ఇంకా దొంగతనం, నమ్మకద్రోహం మరియు, మోసం వంటి ఆరోపణలు కూడా చేశారు. రియా ఆర్థికంగా సుశాంత్ ను మోసం చేసిందని మానసికంగా హింసించిందని పేర్కొన్నాడు.<ref>[https://www.hindustantimes.com/india-news/from-theft-cheating-to-breach-of-trust-sushant-singh-rajput-s-father-charges-against-rhea-chakraborty/story-DkKuZSXUmBsxhBip9piO3N.html FIR లో రియాపై మరిన్ని నేరారోపణలు]</ref> సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని, సుశాంత్ తండ్రివి తప్పుడు ఆరోపణలని రియా సుప్రీం కోర్టుకు విన్నవించుకొంది.<ref> [https://www.dnaindia.com/bollywood/report-rhea-chakraborty-alleges-sushant-singh-rajput-s-father-kk-singh-falsely-implicating-her-in-actor-s-death-case-2835023 తన పై నేరారోపణలు అసత్యాలు అని తెలిపిన రియా]</ref> పాట్నాలో కేసు తప్పుదోవ పట్టవచ్చని, కేసును ముంబయి కి బదిలీ చేయాలని రియా కోరింది.<ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-tells-sc-she-was-in-live-in-with-sushant-singh-rajput-for-a-year-his-father-used-influence-to-file-fir-against-her/story-LsI3VTPaIpKN7PpO4PZgQM.html నిష్పక్షపాత విచారణ నిమిత్తం కేసును ముంబయికి తరలించాలని విన్నవించుకొన్న రియా]</ref> సుశాంత్ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలను శోధించే Enforcement Directorate 150 మిలియను రూపాయల మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది.<ref> [https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-case-actor-rhea-chakraborty-asked-to-appear-before-enforcement-directorate-by-friday-2274795 రియా పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్]</ref>
 
13 జూన్ న సుశాంత్ తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడని పలు నివేదికలు తెలిపిననూ, సుశాంత్ ఇంట్లో పనివారు, వారిని విచారించిన బీహార్ పోలీసులు ఈ వార్తను నిరాకరించారు. తొలుత సుశాంత్ ఇంట్లో ఉన్న CCTV పని చేయటం లేదని తెలిపిన ముంబయి పోలీసులు<ref> [https://www.dnaindia.com/bollywood/report-exclusive-sushant-singh-rajput-did-not-party-at-home-or-go-outside-on-june-13-househelp-tells-bihar-police-2835054 సుశాంత్ ఇంట్లో అమర్చబడ్డ CCTV కెమెరాలు పని చేయలేదన్న పోలీసులు]</ref> 3 ఆగస్టు న మాత్రం తాము CCTV ఫుటేజ్ ని పరిశీలించామని ఆ రోజు ఎటువంటి పార్టీ జరుగలేదని ధృవీకరించారు.<ref> [https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/rhea-chakraborty-is-not-missing-says-her-lawyer/articleshow/77330728.cms దిశ హత్యకు సుశాంత్ ఆత్మాహుతికి ఎటువంటి సంబంధం లేదు]</ref>
పంక్తి 41:
19 ఆగస్టున సుప్రీం కోర్టు విచారణ బాధ్యతలు CBI తీసుకోవడాఅనికి అనుమతించటమే కాక, భవిష్యత్తులో సుషాంత్ మరణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన కేసులను CBI పర్యవేక్షించాలని అజ్ఞాపించింది.<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-family-vs-rhea-chakraborty-case-verdict-sc-allows-cbi-to-take-control-of-investigation-1712765-2020-08-19 CBI కే బాధ్యతలు అప్పగించిన సుప్రీం కోర్టు]</ref> న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే AIIMS (All India Institute of Medical Sciences) యొక్క Forensic Medicine HOD అయిన సుధీర్ గుప్తా ను ఈ కేసు లో సహాయసహకారాలను అందించేందుకు CBI నియమించింది.<ref>[https://zeenews.india.com/people/aiims-forms-5-member-medical-board-to-look-into-sushant-singh-rajputs-autopsy-report-2304428.html AIIMS నియామకం]</ref>. 21 ఆగస్టున గుప్తా "హత్య కోణం లో కూడా మేము దర్యాపు చేస్తాం. అయితే, మిగితా అన్నీ కోణాలను కూడా మేము నిశితంగా పరిశీలిస్తాం." అని PTI (Press Trust of India) కు తెలిపారు. "పోస్టు మార్టం జరిగిన సమయంలో ఇతర సాక్ష్యాధారాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆత్మాహుతి, హత్యారోపణల దిశగా పరిశీలిస్తాం." అని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కు తెలిపారు.<ref>[https://aninews.in/news/national/general-news/aiims-forensic-team-to-analyze-sushant-singh-rajput-case-reports-give-medico-legal-opinion20200821192934 అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామన్న AIIMS]</ref>
 
26 ఆగస్టున Narcotics Control Bureau రియా, రియా సోదరుడు షోవిక్ మరియు, ఇంకొక ముగ్గురి పై FIR దాఖలు చేసింది. ఆర్థిక విచారణలో రియా, షోవిక్ లకు మాదకద్రవ్యాలు అందినవి అని తేలిన తర్వాత, ఇక పై విచారణలో పాల్గొనటానికి ED NCB కి ఆహ్వానం పంపింది. గంజాయి వాడారని తేలడంతో Narcotic Drugs and Psychotropic Substances Act (NDPS Act) చట్టం క్రింద ఈ FIR దాఖలు చేయబడ్డది <ref>[https://www.hindustantimes.com/india-news/narcotics-bureau-files-fir-against-rhea-five-others/story-zb57i3XFN57WupZIQpW3QL.html రియాతో బాటు పలు ఇతరులపై మాదక ద్రవ్యాల దుర్వినియోగం చట్టాల కొరడా]</ref>. ఇదే చట్టం క్రింద 4 సెప్టెంబరున షోవిక్ ను, సుశాంత్ ఇంటి నిర్వాహకుడిని అరెస్టు చేయడం జరిగింది <ref>[https://www.elkeesmedia.com/entertainment/bollywood/sushant-singh-rajput-case-showik-samuel-to-remain-in-ncb-custody-till-sept-9-13902.html రియా సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి నిర్వాహకుడు అరెస్టు]</ref> . 9 సెప్టెంబరున NCB రియా ను సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అభియోగం పై అరెస్టు చేశారు. సుశాంత్ మరణం పై జరుగుతోన్న విచారణలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి అరెస్టు చేయబడ్డ 20 మంది లో రియా కూడా ఒకరు <ref>[https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/sushant-singh-rajput-case-rhea-chakrabortys-judicial-custody-extended-till-october-20/articleshow/78510830.cms రియా అరెస్టు]</ref>. 6 అక్టోబరున ముంబయి సెషన్స్ కోర్టు రియా రిమాండు ను 20 అక్టోబరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాతి రోజే ముంబయి హై కోర్టు రియాకు బెయిలు మంజూరు చేసింది <ref>[https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/rhea-chakraborty-bail-order-highlights-bombay-high-court-says-she-is-not-part-of-chain-of-drug-dealers/articleshow/78531863.cms రియాకు బెయిలు మంజూరు]</ref>. సుశాంత్ కు మాదకద్రవ్యాలు అందించి రియా నే అనే NCB వాదన ను ముంబయి హై కోర్టు తోసిపుచ్చింది. పైగా మాదక ద్రవ్యాల వర్తకులతో రియాకు ఎటువంటి భాగస్వామ్యం లేదని తేలింది. దీనితో జస్టిస్ సారంగ్ కొత్వాల్, "తాను ఖరీదు చేసిన మాదకద్రవ్యాలను ఆర్థిక, మరే ఇతర లాభాల కోసం వేరొకరికి అందించ లేదు." అని పేర్కొన్నారు.
 
3 అక్టోబరు న AIIMS కు చెందిన సుధీర్ గుప్తా, "సుశాంత్ ది ఆత్మహత్యే. హత్య అనే వాదనకు తావు లేదు." అని తెలిపారు.<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-murder-completely-ruled-out-it-was-suicide-dr-sudhir-gupta-of-aiims-1727920-2020-10-03 సుశాంత్ ది ఆత్మాహుతే అని పునరుద్ఘటించిన AIIMS]</ref> . ANI కు తెలుపుతూ, "ఉరి తప్పితే అతని శరీరం పై ఎటువంటి గాయాలు లేవు. ఎటువంటి ప్రతిఘటన/గింజుకొనే ప్రయత్నం, అతని శరీరం దుస్తులపై లేదు." అన్నారు.<ref>[https://www.hindustantimes.com/india-news/aiims-report-on-sushant-singh-rajput-death-who-said-what/story-bASG0BNVkkHtRRICgHeItN.html AIIMS నివేదిక]</ref>. 5 అక్టోబరున AIIMS మెడికల్ బోర్దు CBI కి సుశాంత్ ది ముమ్మాటికీ ఆత్మహత్యే, హత్య కాదు అని నివేదిక సమర్పించినట్లు ANI పేర్కొంది.
 
== ప్రతిస్పందనలు ==
సుశాంత్ మరణం ఊహించనిదిగా, మరియు, ఆశ్చర్యం కలిగించేదిగా అభివర్ణించబడింది <ref>[https://www.outlookindia.com/website/story/india-news-shocked-tragic-loss-bollywood-celebs-cricketers-ministers-mourn-sushant-singh-rajputs-death/354735 "అనూహ్యం, బాధాకరం" అని స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటీర్లు, మంత్రులు]</ref>. మానసిక ఆరోగ్యం పై పలు చర్చలకు తెర తీసింది <ref>[https://www.bbc.com/news/world-asia-india-53047596 మానసిక ఆరోగ్యం పై చర్చలకు తెర తీసిన సుశాంత్ మరణం]</ref>. చాలా మంది ప్రముఖ నేతలు మరియు, నటీనటులు సాంఘిక మాధ్యమాలలో స్పందించారు <ref>[https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/bollywood-in-shock-after-sushant-singh-rajputs-sudden-demise/articleshow/76369015.cms సాంఘిక మాధ్యమాలలో స్పందించిన పలువురు ప్రముఖులు]</ref>. ట్విట్టర్ లో ప్రధాని [[నరేంద్ర మోడీ]] "a bright young actor gone too soon" అని తెలిపారు. క్రికెటీర్లు [[సచిన్ టెండుల్కర్]] మరియు, [[విరాట్ కోహ్లి]] లు తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు <ref>[https://www.thehindu.com/entertainment/movies/sushant-singh-rajput-death-reactions/article31826185.ece పలువురి ప్రతిస్పందనలు]</ref>.
 
సుశాంత్ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం, 2019 లో విడుదల అయిన చిచోరే వంటి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన తర్వాత సుశాంత్ తొమ్మిది చిత్రాలను ఒప్పుకొన్నాడని, అయితే ఆరు నెలల కాలవ్యవధి లోనే అన్ని అవకాశాలు కనుమరుగైయాయని తెలిపారు <ref>[https://economictimes.indiatimes.com/magazines/panache/complaint-against-salman-k-jo-ekta-in-bihar-court-over-sushant-s-rajputs-death/articleshow/76424080.cms "సుశాంత్ అవకాశాలు కోల్పోయాడు" - కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం]</ref>.
పంక్తి 56:
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి.<ref>[https://www.bollywoodhungama.com/news/bollywood/sushant-singh-rajput-death-bihar-breaks-songs-bashing-rhea-chakraborty/ భోజ్ పురి లో రియా కు వ్యతిరేకంగా గీతాలు]</ref>
 
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుషాంత్ కోసం సామూహిక ప్రార్థన (Global Prayers for SSR) తలపెట్టింది. 15 ఆగస్టు స్థానిక కాలమానం ప్రకారం ఉ: గం| 10.00 | ని కి సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రకటించింది.<ref>[https://www.dnaindia.com/bollywood/report-global-prayers-for-ssr-ankita-lokhande-sushant-singh-rajput-s-sister-shweta-singh-kirti-request-people-to-share-images-2837601 సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని అతని సోదరి ప్రార్థనలు]</ref> కుటుంబ సభ్యులు మరియు, అభిమానులతో బాటు బాలీవుడ్ కు చెందిన కృతి సనన్, అంకిత లోఖండే మరియు, ఏక్తా కపూర్ ఈ ప్రార్థనలో పాలుపంచుకొన్నారు.<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/kriti-sanon-and-ankita-lokhande-join-sushant-singh-rajput-s-family-in-global-prayers-for-ssr-1711530-2020-08-15 ప్రార్థనలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, సహ నటులు]</ref><ref>[https://www.indiatvnews.com/entertainment/celebrities/kriti-sanon-ankita-lokhande-others-join-sushant-singh-rajput-s-family-for-global-prayer-meet-642268 సుశాంత్ ఆత్మశాంతికై ప్రార్థనలు]</ref>
 
సుశాంత్ కేసు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా, అవిరామంగా చర్చించబడింది.<ref>[https://www.deccanherald.com/amp/national/media-coverage-in-sushant-singh-rajput-case-opens-up-a-debate-on-role-of-press-887031.html ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చించబడ్డ సుశాంత్ మరణం]</ref><ref>[https://www.bbc.com/news/amp/world-asia-india-54098615 సుశాంత్ మరణం పై చర్చలు]</ref> 3 సెప్టెంబరు 2020 రెండు PIL (Public Interest Litigation) లను పరిగణలోకి తీసుకొంటూ ముంబయి పోలీసు కు వ్యతిరేకంగా "అనుచిత, దురుద్దేశ్యపూర్వకంగా మరియు, ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారాన్ని" ఉద్దేశ్యించి బొంబాయి హై కోర్టు, "ఈ కేసు విచారణకు ఏ విధమైన అడ్డుకట్టలు పడకుండా ఉండేలా ప్రసార మాధ్యమాలలో తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరుతున్నాం మరియు, ఆశిస్తున్నాం" <ref> [https://www.thehindu.com/news/national/bombay-high-court-asks-media-to-show-restraint-in-reporting-of-sushant-case/article32516243.ece. మీడియా తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరిన ముంబయి హై కోర్టు]</ref> అని సలహా ఇచ్చింది. 5 అక్టోబరు 2020న ముంబయి పోలీసు మరియు, దాని అనుబంధ సైబర్ యూనిట్ సాంఘిక మాధ్యమాలు 80,000 కు పైగా ఫేక్ అకౌంట్ ల ను గుర్తించారు. ఆసియా, ఐరోపా ఖండాలలోని వివిధ దేశాల నుండి ఈ అకౌంట్లు వారి అధికారిక విచారణకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమీషనర్ పరం వీర్ సింగ్, "అప్పటికే 6,000 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకి ఉంది. 84 పోలీసు ఉద్యోగులు వైరస్ వల్ల మృతి చెందారు. ఈ దుష్ప్రచారాలు మా మీద బురద చల్లటానికి, విచారణను ప్రక్కదారి పట్టించటానికి చేయబడ్డాయి. చట్టాన్ని అతిక్రమించిన వారి పై Information Technology Act చట్టం క్రింద కేసు నమోదు చేస్తాం." అని తెలిపారు <ref>[https://www.hindustantimes.com/mumbai-news/sushant-singh-rajput-death-case-over-80k-fake-accounts-created-to-discredit-mumbai-police-probe/story-qjpqRUsgC95wBwshReLiyI.html ముంబై పోలీసుల పై బురద జల్లేందుకే సృష్టించబడ్డ పలు ఫేక్ ఐడి లు]</ref>.
 
=== CBI పరిశోధనకై విన్నపం ===
పంక్తి 70:
 
=== సినీ పరిశ్రమ లో పక్షపాతం పై చర్చ ===
సుశాంత్ మరణం బాలీవుడ్ లో వంశ పారంపర్యం మరియు, ఇతర దుశ్చర్యలపై చర్చలకు తెర తీసింది. కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, [[సల్మాన్ ఖాన్]] మరియు, ఏక్తా కపూర్ లతో సహా మరో నలుగురి పై సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది పాట్నా ఉన్నత న్యాయస్థానం లో వంశపారంపర్యం వల్లనే సుశాంత్ కు అవకాశాలు కొరవడ్డాయని, అందుకే సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కేసు వేశారు.<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-suicide-case-filed-against-karan-johar-salman-khan-ekta-kapoor-in-bihar-1689901-2020-06-17 కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ మరియు, ఏక్తా కపూర్ల పై కోర్టు కేసు]</ref>. కానీ ఈ కేసులో 8 జూలై న కొట్టివేయబడింది.<ref>[https://www.indiatoday.in/amp/movies/celebrities/story/sushant-singh-rajput-suicide-case-bihar-court-dismisses-plea-against-karan-johar-salman-khan-1698432-2020-07-08 కేసు కొట్టివేత]</ref> కరణ్ జోహార్ మరియు, ఆలియా భట్ లు సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్డారు.<ref>[https://www.news18.com/news/buzz/bullying-karan-johar-alia-bhatt-for-sushant-singh-rajputs-death-doesnt-fix-nepotism-or-mental-health-battle-2673871.html సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్ద కరణ్ జోహార్, ఆలియా భట్]</ref>
 
కంగనా రనౌత్ తన అనుచర వర్గం తో బాలీవుడ్ లో వేళ్ళూనుకొని ఉన్న పక్షపాత ధోరణిని దుయ్యబట్టారు.<ref>[https://www.republicworld.com/entertainment-news/bollywood-news/kangana-ranaut-speaks-to-arnab-exposes-movie-mafia-full-interview.html సినీ పరిశ్రమలో వంశ పారంపర్యాన్ని దుయ్యబట్టిన కంగనా రణావత్]</ref> రిపబ్లిక్ టీవీ ముఖ్య ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి తో ముఖాముఖిలో సుశాంత్ మరణానికి కారణం 'మూవీ మాఫియా' నే అని తెలిపారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలు అయిన ధర్మా ప్రొడక్షన్స్ మరియు, యష్ రాజ్ ఫిలింస్ పనిగట్టుకొని సుశాంత్ వైఫల్యం చవి చూపించారని, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ సుశాంత్ ను బహిరంగంగా అవహేళన చేసారని తెలిపారు <ref>[https://www.republicworld.com/entertainment-news/bollywood-news/kangana-ranaut-arnab-asks-why-was-mahesh-bhatt-counselling-sushant.html కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, కొందరు విమర్శకులు సుశాంత్ లో ఆత్మన్యూనతాభావాన్ని నూరిపోశారన్న కంగన]</ref>.
 
సిమీ గేరేవాల్ <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/what-sushant-endured-distraught-simi-garewal-applauds-kangana-ranaut-1702189-2020-07-19 కంగన ను సమర్థించిన సిమీ గెరెవాల్]</ref>, ఏ ఆర్ రెహమాన్ <ref>[https://www.dnaindia.com/bollywood/report-people-bashing-kangana-need-to-see-this-netizens-react-to-ar-rahman-s-comment-about-gang-spreading-rumours-2834050 తాను సైతం బాలీవుడ్ లో పక్షపాత ధోరణిని ఎదుర్కొన్నానని తెలిపిన ఏ ఆర్ రెహమాన్]</ref> తాము బాలీవుడ్ లో ఎదుర్కొన్న పక్షపాత ధోరణిని బయట పెట్టారు. సినీ సంగీత రంగంలో ఉన్న పక్షపాత ధోరణిని ''మ్యూజిక్ మాఫియా'' గా సోనూ నిగం అభివర్ణించారు.<ref>[https://www.news18.com/amp/news/movies/sonu-nigam-calls-out-music-mafia-in-bollywood-warns-about-suicides-in-music-industry-2676533.html మ్యూజిక్ మాఫియా గురించి గాయకుడు సోనూ నిగం]</ref> పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో సాంఘిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందింది.<ref>[https://www.indiatoday.in/movies/bollywood/story/tuesday-trivia-what-changed-amitabh-bachchan-and-kader-khan-s-friendship-just-a-title-sir-ji-1702887-2020-07-21 పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో వైరల్ ]</ref>