రామ్ పోతినేని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 17:
 
== సినీ జీవితం ==
నట శిక్షకుడు [[ఎన్.జె. భిక్షు]] దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref> రామ్ నటించిన మొదటి చిత్రం [[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]. ఇందులో [[ఇలియానా]] కథానాయిక. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి [[ఫిలింఫేర్]] సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం [[సుకుమార్]] దర్శకత్వం వహించిన [[జగడం]]. ఈ చిత్రం 2007 మార్చి 16 న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందాయి. 2008 లో [[శ్రీను వైట్ల]] దర్శకత్వంలో [[జెనీలియా]] సరసన [[రెడీ]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.<ref>{{Cite web |url=http://articles.timesofindia.indiatimes.com/2008-09-27/news-interviews/27923690_1_pleasant-surprise-hansika-ram |title=ఆర్కైవ్ నకలు |access-date=2013-03-18 |website= |archive-date=2012-09-18 |archive-url=https://web.archive.org/web/20120918111025/http://articles.timesofindia.indiatimes.com/2008-09-27/news-interviews/27923690_1_pleasant-surprise-hansika-ram |url-status=dead }}</ref>
 
2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి [[బి.గోపాల్]] దర్శకత్వంలో [[మస్కా]]. ఇందులో [[హన్సికా మోట్వాని]], షీలా కథానాయికలు. మరో చిత్రం ఎం.శరవణన్ దర్శకత్వంలో [[గణేష్ (2009 సినిమా)|గణేష్]]. ఇందులో [[కాజల్ అగర్వాల్]] కథానాయిక. మస్కా ఓ మోస్తరు విజయం సాధించగా గణేష్ పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చెసుకున్నాడు. 2010 లో రామ్ శ్రీవాస్ దర్శకత్వంలో [[రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)|రామ రామ కృష్ణ కృష్ణ]] చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] చిత్రంలో నటించాడు. ఇందులో హన్సిక, అక్ష కథానాయికలు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/రామ్_పోతినేని" నుండి వెలికితీశారు