తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజకీయ ఉద్యమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: మానవిక తిరగవేత
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''తెలంగాణ రాష్ట్ర సమితి''' ([[తెరాస]]) ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] అప్పటి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి. ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]]ను ఏర్పాటు చేశాడు. [[ఆలె నరేంద్ర]], సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]]ను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం లో టీఆర్​ఎస్​ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్‌ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్‌ , నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్‌ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొ న్నా రు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యకలాపాలు సాగాయి. 2001 మే 17న కరీంనగర్‌ ఎస్‌ ఆర్‌ ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌ లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జేఎంఎం చీఫ్‌ , అప్పటి జార్ఖండ్‌ సీఎం శిబూ సోరె న్‌ ఈ మీటింగ్‌ కు చీఫ్‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు. కొన్ని ఘటనల<ref>{{Cite web|url=https://www.v6velugu.com/trs-celebrating-its-19th-foundation-day/|title=TRS @ 19 : నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం {{!}} V6 Velugu|language=en-US|access-date=2020-04-27|website=|archive-url=https://web.archive.org/web/20190530225903/http://www.v6velugu.com/trs-celebrating-its-19th-foundation-day/|archive-date=2019-05-30|url-status=dead}}</ref> తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాలు నందినగర్ , హైదరాబాద్ లోని కేసీఆర్‌ నివాసానికి మారాయి. ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చారు. 2004లో వైఎస్‌ ప్రభుత్వం బంజారాహిల్స్‌‌ రోడ్​ నంబర్​ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్​ ఉన్న స్థలాన్ని టీఆర్‌ ఎస్‌ కు కేటాయించింది. ప్రస్తుతం క్యాంటీన్‌ నిర్మిస్తున్న స్థలంలో రేకుల షెడ్డు వేసి టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభిం చారు. 2006లో తెలంగాణ భవన్‌ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీకి 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు<ref>{{Cite web|url=https://www.ntnews.com/telangana/minister-ktr-call-to-party-cadre-for-party-flag-host-their-houses-only-29414|title=టీఆర్ఎస్ కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగరవేయాలి: కేటీఆర్|date=2020-04-26|website=ntnews|language=te|access-date=2020-04-27}}</ref><ref name="TRS Foundation Day: ఉద్యమ పార్టీగా ప్రస్థానం..">{{cite news |last1=Sakshi |title=TRS Foundation Day: ఉద్యమ పార్టీగా ప్రస్థానం.. |url=https://www.sakshi.com/telugu-news/politics/trs-enters-21st-year-foundation-day-be-low-key-affair-1359616 |accessdate=27 April 2021 |date=27 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210427092017/https://www.sakshi.com/telugu-news/politics/trs-enters-21st-year-foundation-day-be-low-key-affair-1359616 |archivedate=27 April 2021 |language=te}}</ref>.
== ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ==
పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించడం దగ్గర్నుంచి కార్యాచరణను నిర్దేశించడం వరకు , తెలంగాణ సమాజాన్ని, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు. స్ట్రీట్ ఫైట్‌ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాలని , అందుకు వాహకంగా ‌తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌ )ని తీర్చిదిద్దారు. అప్పుటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో అదొక సాహసోపేతమైన సూత్రీకరణ.