వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 258:
19.(1) రాజ్య ప్రభుత్వము, నిరు పేదవారైన వయోవృద్ధ పౌరులకు అందుబాటు స్థలములలో దశలవారీగా తాను అవసరమని భావించునట్టి సంఖ్యలో, ప్రారంభములో అట్టి ఆశ్రమములో నూటయాభై మందికి వసతి కల్పించునట్లుగా కనీసము ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమములను స్థాపించి మరియు నిర్వహించవచ్చును.
 
(2) రాజ్య ప్రభుత్వము, వృద్ధాశ్రమముల ప్రమాణములు మరియు అట్టి ఆశ్రమములో నివాసముండు వారికి వారిచే కల్పించబడు వైద్య సంరక్షణ మరియు వినోద సదుపాయముల కొరకు అవసరమైన వివిధ రకముల సేవలతోపాటు అట్టి వృద్ధాశ్రమముల నిర్వహణ కొరకుగాను ఒక పథకమును విహితపరచవచ్చును.
 
విశదీకరణ:- ఈ పరిచ్చేదము నిమిత్తము "నిరు పేద” అనగా ఆయా సమయములందు రాజ్యప్రభుత్వముచే నిర్ధారించబడినట్లుగా తనకుతాను పోషించుకొనుటకుతగినంత జీవనాధారము లేని ఎవరేని వయోవృద్ధ పౌరుడు అని అర్ధము;
 
అధ్యాయము - - IV
 
వయోవృద్ధపౌరుల వైద్య సంరక్షణ కొరకు నిబంధనలు,
 
వయోవృద్ధ పౌరులకు వైద్యపరమైన మద్దతు.
 
20. రాజ్య ప్రభుత్వము ఈ క్రింది వాటిని కల్పించేటట్టు చూడవలెను,- (i) ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రభుత్వముచే పూర్తిగా లేదా పాక్షికముగా నిధులను పొందుతున్న ఆసుపత్రులు సాధ్యమైనంత వరకు వయోవృద్ధ పౌరులందరికి పడకలను సమకూర్చవలెను;
 
(ii) వయోవృద్ధ పౌరుల కొరకు ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేయవలెను;
 
(iii) వయోవృద్ధ పౌరులకు దీర్ఘకాలిక, తీవ్రమైన మరియు క్షీణదశలోనున్న వ్యాధుల చికిత్సకైన సదుపాయమును విస్తరింపజేయవలెను;
 
(iv) వృద్ధాప్యమున కైన మరియు దీర్ఘకాలిక, ముదిమి వ్యాధులకు పరిశోధనా కార్యములను విస్తరింప జేయవలెను;
 
(V) ప్రతి జిల్లాలోని ఆసుపత్రిలో, తగురీతిలో వృద్ధ వైద్య (జెరియాట్రిక్) సంరక్షణలో అనుభవము కలిగిన వైద్యాధికారి నేతృత్వంలో వైద్యము కావలసిన వృద్ధవైద్య (జెరియాట్రిక్) రోగులకు సౌకర్యములను ప్రత్యేకించి ఉంచవలెను.
 
అధ్యాయము - V
 
వయోవృద్ధపౌరుల ప్రాణము మరియు ఆస్తికి రక్షణ.
 
21. వయోవృద్ధ పౌరుల సంక్షేమమునకై ప్రచారము, అవగాహన మొదలగు నటువంటి చర్యలు. 21.రాజ్య ప్రభుత్వము, నియమిత వ్యవధులలో దూరదర్శన్, ఆకాశవాణి మరియు ముద్రణతోసహా సార్వజనిక మాధ్యమముల ద్వారా విస్తృతమైన ఈ చట్టపు నిబంధనలకు ప్రచారమునిచ్చుట;
1. https://legislative.gov.in/sites/default/files/TE-2007-56.pdf
2. http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3