వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
===ఉపోద్ఘాతము===
జీవిత లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు, కూతుళ్లను పెంచి పోషించి, విద్యా బుద్దులు చెప్పించి ప్రయోజకులను చేసి, ఆస్తి పాస్తులను సమకూర్చి, పెళ్లిల్లు చేసి ఓ బాట చూపించి.చివరి దశలో మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం ఇది. ఆ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తుంటారు. ఆ దశలో తమె కొడుకులు ఏదేని వక్ర మార్గం అనుసరిస్తుంటే వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నంలో కొన్ని సలహాలు, సూచనలు చేస్తుంటారు. చాలా మందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తుంటే, మరి కొందరు వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది. 2007లో తల్లిదండ్రులు, పెద్దల పోషణకు సంక్షేమ చట్టం కూడ చేసింది.
 
==భారత దేశంలో కుటుంబ వ్వవస్త==
ఒకప్పుడు భారత దేశములో ఉమ్మడి కుటుంబాలు పెద్దసంఖ్యలోనే కన్పించేవి. కాల క్రమములో ఈర్ష్య, అసూయ, చిన్నచిన్న స్పర్ధలు, ఆర్థిక చిక్కులు మొదలగునవి ఈ చక్కటి కుటుంబాల్లో చిచ్చురేపినవి. ఈ దెబ్బకు ఉమ్మడి కుటుంబాలు ముక్కలైపోయినవి. కాలపరీక్షలో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ భారతీయ కుటుంబం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారింది. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు చెదరగొడుతూంటే భారతీయ సమాజంలో ప్రేమాభిమానాలు అల్లుకున్న కుటుంబం వర్థిల్లుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే అప్పుడున్నంత విస్తృతంగా నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇప్పుడు చిన్నకుటుంబాలదే రాజ్యం. ఈ పరిణామం వల్ల ఆర్థికంగా కుటుంబం ఎదుగుతున్నా మానసికంగా బలహీనపడుతోంది. ఈ పరిణామాలు కొన్ని కుటుంబాలను దెబ్బతీస్తున్నాయి. పరిమిత కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇంటి పెద్దలపై పనిభారం పెరిగిపోతోంది. లంకంత ఇల్లయినా మహిళలు, పిల్లలు, పెద్దలకు ఒంటరితనం తప్పడం లేదు. మనదేశంలో ఈ విపరిణామం స్వల్పస్థాయిలోనే ఉంది. కానీ, పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాలు కకావికలమై పోతున్నాయి. భారతదేశంలో కుటుంబ వ్యవస్థను పరిశీలించి, అనుసరించేందుకు ఇప్పుడు ఎన్నెన్నో దేశాలు ఉత్సాహం చూపుతున్నాయి.