వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==కుటుంబం వ్వవస్తలో ఐరాస ప్రమేయం==
<ref>http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3</ref>
ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి, అలా చేయకపోతే కలిగే సామాజిక వైఫల్యాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచడానికి ఐక్యరాజ్యసమితి సైతం నడుం బిగించింది.
కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే సమాజంలో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో ఐక్యరాజ్య సమితి గ్రహించింది. ఒంటరితనం, వ్యసనాలకు బానిసలు కావడం, మానసిక కుంగుబాటు, పెద్దలు, పిల్లలను పట్టించుకునేవారు లేకపోవడం, మహిళలపై పనిభారం పెరిగిపోవడం, వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. సగటు కుటుంబంలో యజమాని సంపాదన బాధ్యత తీసుకుంటే ఇల్లాలు కుటుంబాన్ని నిర్వహించడాన్ని బాధ్యతగా తీసుకుంటోంది. ఆధునిక ప్రపంచంలో ఇల్లాలు కూడా సంపాదనలో పడుతోంది. ఇంట్లో దంపతులు ఇద్దరూ పనికి వెళ్లినప్పుడే సమస్యలు మొదలవుతున్నాయి. పిల్లల పెంపకం, వృద్ధులను చూసుకోవడం పెద్దసమస్యగా మారుతోంది. కుటుంబ బంధాన్ని ఈ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. సమాజంలో కుటుంబ వ్యవస్థను కుదిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని కాపాడుకునే బృహత్తర బాధ్యతను ఐక్యరాజ్య సమితి నెత్తికెత్తుకుంది. కుటుంబ వ్యవస్థను ఎందుకు కాపాడుకోవాలో వివరిస్తూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ఏటా మే 15వ తేదీని ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’గా పరిగణించి ప్రజాచైతన్యానికి విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఒక అంశాన్ని ఒక నినాదంగా ప్రకటిస్తోంది. ఈ ఏడాది నినాదం- ‘హెల్తీ లైవ్స్ అండ్ సస్టెయినబుల్ ఫ్యూచర్’. ఆరోగ్యకరమైన జీవితాలు, స్థిరమైన భవిష్యత్తుతోకూడిన కుటుంబం కోసం ఐరాస తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.