వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==కుటుంబములో ఆర్దిక అవసరాల పెరుగుదల==
 
<ref>http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3</ref>ప్రపంచం ఇప్పుడు ఎంతో మారిపోయింది. ప్రగతిపథం వైపు జనజీవన రథం పరుగులు పెడుతోంది. ముందుకు వెళ్లాలంటే మనం కూడా పరుగుపెట్టాల్సిందే. ఆ పరుగులో అలసిపోయినప్పుడు, మనవాళ్లకు దూరంగా వెళ్లినప్పుడు కుటుంబం గుర్తుకువస్తుంది. మనకి దూరంగా ఉండిపోయిన కుటుంబ సభ్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కుటుంబంలోని ఆడామగ (దంపతులు) కూడ పనిచేయాల్సి వస్తోంది. పనివేళలు, ఒత్తిడి వారిపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లోని మిగతా సభ్యుల కోసం తగినంతగా సమయం వెచ్చించలేక పోతున్నారు. మనసులో ఉన్నా ఆ మమకారాన్ని వ్యక్తం చేసే తీరిక ఉండటం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఇది పెద్ద సమస్య. పిల్లల ఆలనాపాలన, ఆరోగ్యం, చదువువంటి అంశాలపై ప్రత్యక్షంగా తల్లిదండ్రుల పాత్ర తగ్గి పోతోంది. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు లేక పోవడంతో ఆప్యాయంగా కథలు కబుర్లు పిల్లలకు చెప్పే వారు లేక పిల్లలు మానసికంగా ఒంటరి వారవుతున్నారు. యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నారు. ఇక ఇంట్లో వృద్ధులు ఉంటే వారికి కాలక్షేపం కష్టమైపోతోంది. పలకరించేవారు, పట్టించుకునేవారు లేరన్న దిగులు వారిని మరింత కుంగదీస్తోంది. తమ కొడుకు, కోడలు మంచివారే అయినా, బాగోగులు చూసేవారే అయినా వారికి తీరిక లేక- వృద్ధులు ఓల్డేజ్ హోంలలో గడపాల్సి వస్తోంది. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కుటుంబంలో అందరూ కలసి, హాయిగా గడపాల్సిన చోట హడావుడిగా, చిరాకుగా గడపడం తప్పడం లేదు. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం, బాధ్యతలు పంచుకోవడం, మానసికంగా నేనున్నాననే భరోసా ఇవ్వడం వంటి లక్షణాలు కుటుంబ సభ్యులకు ఉపశమనాన్ని ఇచ్చే అంశాలు. పాశ్చాత్య సంస్కృతిలో ఇది లోపించింది. అక్కడ అన్ని కుటుంబాలు అలా ఉన్నాయని కాదు. చాలా కుటుంబాల్లో పరిస్థితి అది. ఇక్కడ ఒకరికోసం ఒకరు అన్న రీతిలో కుటుంబ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. అక్కడ ఆర్థిక, వ్యక్తిగత ఇష్టాలకే ప్రాధాన్యం. అందువల్ల బలమైన కారణాలు లేకుండానే విడిపోతున్న దంపతులు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. వారికి పుట్టిన పిల్లలు మానసికంగా దెబ్బతింటున్నారు. ఈ పరిణామం సమాజంపై పెనుప్రభావం చూపిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం ఇలా విడిపోయిన కుటుంబాలకు చెందిన పిల్లల్లో 45 శాతం మంది వ్యసనాలకు బానిసలవుతున్నారు. 75 శాతం మంది యువత తల్లిదండ్రులతో కలసి ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నప్పటికీ, అలా ఉంటున్నవారి సంఖ్య 40 శాతం లోపే. ముఖ్యంగా అమెరికాలో ఈ పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మహిళలు ఉద్యోగాల్లో చేరినప్పుడు కుటుంబంలో ‘బ్యాలెన్స్’ తప్పుతోంది. కుటుంబ బాధ్యతలతోపాటు ఉద్యోగాలు చేయాల్సి రావడంతో మహిళలపై ఒత్తిడి పెరుగుతోంది.
 
==ఇతర దేశాలలో కుటుంబ వ్వవస్థ==