వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==భారత దేశంలో కుటుంబ వ్వవస్త==
<ref>http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3</ref>ఒకప్పుడు భారత దేశములో ఉమ్మడి కుటుంబాలు పెద్దసంఖ్యలోనే కన్పించేవి. కాల క్రమములో ఈర్ష్య, అసూయ, చిన్నచిన్న స్పర్ధలు, ఆర్థిక చిక్కులు మొదలగునవి ఈ చక్కటి కుటుంబాల్లో చిచ్చురేపినవి. ఈ దెబ్బకు ఉమ్మడి కుటుంబాలు ముక్కలైపోయినవి. కాలపరీక్షలో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ భారతీయ కుటుంబం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారింది. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు చెదరగొడుతూంటే భారతీయ సమాజంలో ప్రేమాభిమానాలు అల్లుకున్న కుటుంబం వర్థిల్లుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే అప్పుడున్నంత విస్తృతంగా నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇప్పుడు చిన్నకుటుంబాలదే రాజ్యం. ఈ పరిణామం వల్ల ఆర్థికంగా కుటుంబం ఎదుగుతున్నా మానసికంగా బలహీనపడుతోంది. ఈ పరిణామాలు కొన్ని కుటుంబాలను దెబ్బతీస్తున్నాయి. పరిమిత కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇంటి పెద్దలపై పనిభారం పెరిగిపోతోంది. లంకంత ఇల్లయినా మహిళలు, పిల్లలు, పెద్దలకు ఒంటరితనం తప్పడం లేదు. మనదేశంలో ఈ విపరిణామం స్వల్పస్థాయిలోనే ఉంది. కానీ, పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాలు కకావికలమై పోతున్నాయి. భారతదేశంలో కుటుంబ వ్యవస్థను పరిశీలించి, అనుసరించేందుకు ఇప్పుడు ఎన్నెన్నో దేశాలు ఉత్సాహం చూపుతున్నాయి.
 
==కుటుంబం వ్వవస్తలో ఐరాస ప్రమేయం==