ప్రియదర్శిని గోవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నృత్యదర్శకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రియదర్శిని గోవింద్''' భరతనాట్య కళాకారిణి.<ref name="SNA">{{cite web |last1=web master |title=Priyadarsini Govind |url=https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=672&at=2 |website=SANGEET NATAK AKADEMI |publisher=SANGEET NATAK AKADEMI |accessdate=3 May 2021}}</ref>
==విశేషాలు==
ఈమె [[1965]], [[ఫిబ్రవరి 1]]వ తేదీన [[చెన్నై]]లో జన్మించింది. ఈమె తొలుత తన 6వ యేటి నుండి ఉష వద్ద భరతనాట్యం అభ్యసించింది. తరువాత ఎస్.కె.రాజరత్నంపిళ్ళై వద్ద, [[కళానిధి నారాయణన్]] వద్ద తన విద్యను మెరుగులు దిద్దుకుంది. ఈమె మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.కాం పట్టాపుచ్చుకుంది. మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా చదివింది.
==వృత్తి==
ఈమె 1974లో తన భరతనాట్య తొలి ప్రదర్శన గావించింది. అది మొదలు ఈమె అనేక సభలలో, నృత్యోత్సవాలలో తన నృత్యప్రదర్శనను ఇచ్చింది. మద్రాసు సంగీత అకాడమీ ఉత్సవాలు, ఖజురహో ఫెస్టివల్, సంగీత నాటక అకాడమీ స్వర్ణసమారోహం, నృత్య సంగం, రవీంద్ర ప్రణతి మొదలైన ఉత్సవాలలో నృత్యం చేసింది. ఇవి కాక టునీషియా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, అమెరికా మొదలైన దేశాలలో జరిగిన భారతీయ ఉత్సవాలలో తన భరతనాట్య ప్రదర్శనను గావించింది. ఈమె సోలో ప్రదర్శనలే కాక [[బాంబే జయశ్రీ]], గౌరీ రామనారాయణ్, [[లీలా శాంసన్]], టి.ఎం.కృష్ణ, [[ఉమయల్పురం కె.శివరామన్]] వంటి కళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు చేసింది. వందేమాతరం, నేత్రు లుద్రు నలై, శృంగారం, శ్రీరంగం, శివశక్తి, ఓం నమో నారాయణ వంటి అనేక నృత్యనాటికలకు రూపకల్పన చేసింది. ఈమె దూరదర్శన్‌లో తిరుప్పావై పాశురాలకు భరతనాట్యాన్ని ప్రదర్శించింది. ఈమె అనేక సెమినార్లలో పాలుపంచుకుంది. నృత్యంపై అనేక సి.డి.లను విడుదల చేసింది.<ref name="శభాష్">{{cite web |last1=web master |title=Priyadarsini Govind Bharatanatyam Dancer, Tamil Nadu, India |url=http://www.sabhash.com/artist/57/priyadarsini-govind.htm |website=శభాష్ |accessdate=3 May 2021}}</ref>
==పురస్కారాలు==
ఈమె అనేక పురస్కారాలను, గౌరవాలను పొందింది. వాటిలో ముఖ్యమైన కొన్ని: