లక్ష్మి విశ్వనాథన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశేషాలు: AWB తో తప్పొప్పుల సవరణ, typos fixed: →
పంక్తి 14:
==విశేషాలు==
ఈమె [[మద్రాసు]]లో 1944లో జన్మించింది. ఈమె భరతనాట్యాన్ని కంజీవరం ఎల్లప్ప పిళ్ళై వద్ద నేర్చుకుంది. కర్ణాటక సంగీతాన్ని తన తల్లి అలమేలు విశ్వనాథన్ వద్ద అభ్యసించింది.<ref name="ISAS">{{cite web |last1=web master |title=Lakshmi Viswanathan |url=https://www.institutesouthasia-rome.com/en/lakshmi-viswanathan/ |website=International Institute of South Asian Studies |accessdate=25 April 2021}}</ref>
ఈమె 10 దేశాలకు పైగా సందర్శించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. భారతదేశంలోని అన్ని ముఖ్యమైన నృత్యోత్సవాలలో పాలుపంచుకుంది. అనేక సెమినార్లలో పత్ర సమర్పణ గావించింది. ఈమె దేవాలయ నాట్యంపై, దేవదాసీ వ్యవస్థపై పరిశోధనలు చేసి వివిధ జర్నల్లలో, న్యూస్‌పేపర్లలో, డాన్స్ పోర్టల్లలో అనేక వ్యాసాలు ప్రకటించింది. "భరతనాట్యం ద తమిళ్ హెరిటేజ్", "కుంజమ్మ ఓడ్ టు ఎ నైటింగేల్" (ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర), "వుమెన్ ఆఫ్ ప్రైడ్ ద దేవదాసి హెరిటేజ్", "కపిలేశ్వర టెంపుల్" వంటి పుస్తకాలను రచించింది. ప్రస్తుతం ఈమె కళాక్షేత్ర జర్నల్‌కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నది.
 
ఈమె బన్యన్ ట్రీ, చతురంగ, మై త్యాగరాజ మొదలైన నృత్యనాటకాలకు నృత్యదర్శకత్వం చేసింది. ఈమె "ది పొయెట్రీ ఆఫ్ డ్యాన్స్" అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తీసి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించింది. ఈమె నాట్య గురువుగా అనేక మంది శిష్యులను నాట్యకళాకారులుగా తయారు చేసింది. ఈమె 1991 నుండి "మామల్లపురం నృత్యోత్సవాల"ను నిర్వహిస్తున్నది. ఈమె అనేక కమిటీలలో సభ్యురాలిగా సేవలను అందించింది. మద్రాసు సంగీత అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_విశ్వనాథన్" నుండి వెలికితీశారు