జమునా కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
ఈమె భరతనాట్య కళాకారిణిగా, గురువుగా, నృత్య దర్శకురాలిగా పేరు సంపాదించింది. ఈమె భక్తి కవిత్వంపై ఎక్కువగా దృష్టి పెట్టి వాటికి నృత్యరూపాన్ని కల్పించింది. ఈమె ఉత్తరభారతదేశపు భక్తికవిత్వాన్ని ముఖ్యంగా 14వ శతాబ్దానికి చెందిన విద్యాపతి కవిత్వానికి భరతనాట్యంలో వర్ణాల రూపంలో ఆకృతిని కల్పించింది. తరువాత ఈమె సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, కబీర్‌ల కవిత్వాన్ని అధ్యయనం చేసి వాటిని కూడా నృత్యరూపంలో ప్రదర్శించింది. ఈమె తమిళ భాషలోని ఆళ్వారుల దివ్యప్రబంధాలను, మాణిక్య వాచకర్ తిరువాచకాన్ని, తిరుక్కురల్‌ను, సుబ్రహ్మణ్యభారతి రచనలను అధ్యయనం చేసి వాటికి కూడా భరతనాట్యంలో కొరియోగ్రఫీలను సృష్టించింది. ఈమె ఢిల్లీలో "కళాంగన్" అనే నృత్యపాఠశాలను ప్రారంభించి అందులో దేశ, విదేశీ శిష్యులకు భరతనాట్యంలో తర్ఫీదునిచ్చింది. ఈమె విదేశాలలో అనేక వర్క్‌షాపులను నిర్వహించింది.
 
ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో 2003లో సాహిత్య కళాపరిషత్, ఢిల్లీ వారి పరిషత్ సమ్మాన్, 2013లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి [[సంగీత నాటక అకాడమీ అవార్డు]] మొదలైనవి ఉన్నాయి.<ref name="హిందూ">{{cite news |last1=Ranee Kumar |title=Jamuna Krishnan: A path-breaker |url=https://www.thehindu.com/entertainment/dance/jamuna-krishnan-a-path-breaker/article27148382.ece |accessdate=6 May 2021 |work=The Hindu |date=16 May 2019}}</ref>
 
ఈమె [[2016]], [[మే 1615]]వ తేదీన మరణించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జమునా_కృష్ణన్" నుండి వెలికితీశారు