డప్పు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[డప్పు]] అనేది ఒక రమైన సంగీత వాద్యం.<ref name=":0">{{Cite web|url=https://www.firstpost.com/living/the-undying-beat-of-the-dappu-how-a-traditional-drum-signifies-dignity-revolution-for-the-madiga-community-8251031.html|title=The undying beat of the Dappu: How a traditional drum signifies dignity, revolution for the Madiga community-Living News , Firstpost|date=2020-04-12|website=Firstpost|access-date=2021-05-09}}</ref> దీనిని కొన్ని ప్రాంతాలలో పలక అని కూడ అంటారు. డక్కి లాంటి ఆకారమె కలిగి వుంటుంది. కాని పెద్దది. రెండడుగులు వ్యాసం కలిగి వుంటుండి. దీనిని ఎక్కువగా అశుభ కార్యాలకు వాయిస్తారు. కొన్ని సందర్భాలలో అమ్మవారి జాతరలలో కూడా వాయిస్తారు. అదేవిదంగా దండోరా వేయడానికి పల్లెల్లో దీనిని గతంలో ఎక్కువగా వాడేవారు. ఈ డప్పును పూర్వకాలంలో [[మాదిగ]] కులస్తులు ఎక్కువగా వాయించేవారు. వారు జంతువుల చర్మాలతో ఈ డప్పును తయారుచేసేవారు.<ref name=":0" />
 
== తయారీ ==
చింత లేదా వేప చెట్టు చెక్కతో వృత్తాకార ఫ్రేం తయారు చేస్తారు. దీణిని తెలంగాణలో "గుండు" అనీ, ఆంధ్రప్రదేశ్ లో "పలక" అని అంటారు. ఈ ప్రేం కు టాంజరిన్ కలపతో శుద్ధి చేయబడిన బంతువుల చర్మాన్ని బిగుతుగా కట్టి ఉంచుతారు. ఈ చర్మం చెక్క చట్రానికి అతికించడానికి జిగురును వాడుతారు. ఈ జిగురును చింతపిక్కల నుండి తయారుచేస్తారు. చట్రానికి చర్మాన్ని బిగుతుగా అతికించి సన్నని దారంతో బింగించి కడతారు. తరువాత చర్మంతో తయారుచేసిన డప్పును మంట వద్ద వేడిచేస్తారు. దీనివల్ల చర్మం బిగుతుగా మారుతుంది. ఈ డప్పును రెండు కర్రలతో వాయిస్తారు. అందులో లావుగా, పొట్టిగా ఉన్న కర్రను కుడి చేతితో పట్టుకుంటారు. దీణిని సిర్రా అంటారు. ఇది డప్పులో క్రింది వైపు కొట్టడానికి వాడుతారు. సన్నగా, పొడవుగా ఉన్న కర్ర "సిట్టికెన్న పుల్ల" ను ఎడమ చేతితో పట్టుకుంటారు. దీనిని డప్పుపై పై భాగంగా వాయించడానికి ఉపయోగిస్తారు. అందులో "సిర్రా" లయను సృష్టించగా, "సిటికెన్న పుల్ల" లయ వేగాన్ని నియంత్రిస్తుంది. <ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డప్పు" నుండి వెలికితీశారు