ప్రబోధానంద యోగీశ్వరులు: కూర్పుల మధ్య తేడాలు

చి Avramanaareddy (చర్చ) చేసిన మార్పులను 182.75.189.174 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| known = ఇందు జ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు, త్రైత సిద్ధాంత కర్త.
| occupation = ఆధ్యాత్మికవేత్త, రచయిత
| title = తెలుగు బుక్ ఆఫ్ రికార్ద్స్-2021 లో నమోదు - ఆధ్యాత్మిక రంగంలో త్రైత సిద్ధాంతము ఆధారంగా వంద(100) గ్రంథములను రచించి-ప్రచురించిన ఏకైక రచయిత
| title =
| salary =
| term =
పంక్తి 52:
=== మరణం ===
2020 జూలై 9న చిన్నపొలమడలోని స్వంత ఆశ్రమంలో బాధపడుతున్న ప్రబోధానందను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.<ref>{{Cite news|url=https://www.andhrajyothy.com/telugunews/prabodhanand-died-2020071003024031|title=ప్రబోధానంద కన్నుమూత|last=|first=|date=9 July 2020|work=ఆంధ్రజ్యోతి|access-date=}}</ref>
 
==పురస్కారములు==
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన శతాధిక, సంచలనాత్మక, ఆధ్యాత్మిక గ్రంథములను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పరిశీలించి '''ఆధ్యాత్మిక రంగంలో త్రైత సిద్ధాంతము ఆధారంగా వంద(100) గ్రంథములను రచించి-ప్రచురించిన ఏకైక రచయిత ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు'''<ref>'''తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పురస్కారము''' http://www.telugubookofrecords.com/home/most-number-of-spiritual-books-written-by-sri-sri-sri-acharya-prabodhananda-yogeeshwarulu/</ref> అని
'''తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్-2021''' లో ధృవీకరించడమైనది.<ref>'''తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పురస్కార వీడియో''' https://www.youtube.com/watch?v=Z6CymhiPwUI</ref><br>
 
== సిద్ధాంతాలు ==
ప్రబోధానంద బోధనలు అనుసరించే భక్తులు తమను తాము ఇందువులనీ, త్రైతులనీ పిలుచుకుంటారు. తాము హిందువులంకామనీ, ఇందువులమనీ వీరు చెప్పుకుంటూంటారు. నిజానికి హిందూమతానికి పూర్వం ఇందుమతం అన్న పేరే వ్యవహారంలో ఉండేదని వీరి విశ్వాసం. విశ్వవ్యాప్తంగా అన్ని మతాలలోనూ త్రైత సిద్ధాంతం ప్రవచించే ఇందూపథం అంతర్లీనంగా ఉందని వీరు చెప్తారు. సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఏ మతము, కులము లేదనీ వీరు చెప్తారు. ఇందు అన్నది ఒక పథము కానీ, మతము కాదని వీరి అభిప్రాయం. హిందు, ఇస్లాం, క్రైస్తవాల్లోని భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాత్రమే వీరు అంగీకరిస్తారు, వేదాలు, పురాణాలు, పాత నిబంధన, హదీసులు వంటివాటిని వీరు తిరస్కరిస్తారు. భగవద్గీత శ్లోకాలలో, 4 సువార్తల వచనాలలో, ఖురాన్ ఆయతులలో మాత్రమే ఆత్మజ్ఞానం ఉందని వీరు పేర్కొంటారు. వీరు శిలువను మాయగా, క్రీస్తును భగవంతునిగా చెప్తారు. వీరు హిందూ దేవతల్లో కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి, రాముడు భగవంతుడు కాడని చెప్తూంటారు. మానవులకు బ్రహ్మవిద్య తెలిపేందుకు భగవంతుడే త్రేతాయుగంలో రావణుడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో ఏసుక్రీస్తు, వేమన యోగీశ్వరుల రూపాల్లో జన్మించాడని వీరి విశ్వాసం. వీరి సిద్ధాంతాల ప్రకారం మతానికి అతీతమైనది ఇందూ పథము. పూర్వం భారతదేశాన్నీ ఇందూదేశము అనేవారనీ కాలక్రమేణ అది వందల సంవత్సరాల క్రితం మాత్రమే, హిందూ దేశంగా మారినది అనీ వీరి వాదన. కుల, మత విశ్వాసాలకు అతీతమైనది వీరి ఇందూ పథం (మార్గం).
 
ప్రబోధానంద ప్రకారం వాస్తుకు శాస్త్ర ప్రామాణికత లేదు. యజ్ఞయాగాలు, వ్రతాలు, వేదాధ్యయనాలు దైవసమ్మతం కాదని వీరి సిద్ధాంతం. వీరి సిద్ధాంతంలో చెప్పబడే ఇంద్రియాతీత ఆత్మ జ్ఞానానికి మంత్ర, జప, ఉపవాస, ధ్యానాదులు అవసరం లేదని భావిస్తారు. ఆచారాలు, సంప్రదాయాలకు ఈ సిద్ధాంతంలో అంతరార్థాలు, ఆత్మజ్ఞాన బద్ధంగా చెప్తారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లకు భాష్యం చెప్తూ, వాటిని ఆయా మతాల ప్రధాన స్రవంతి సిద్ధాంతాల్లోనూ, మతాచార్యులూ వ్యాఖ్యానించే తీరుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తారు. ఇందూపద్ధతిని ప్రచారం చేసి ప్రపంచం అంతా దాని కిందికి తీసుకురావడం ద్వారా వసుధైక కుటుంబం సాధించవచ్చని వీరి భాష్యం. మంత్రాలు-మహత్యాలు, దయ్యాలు-భూతాలు, దేవుడు-దేవతలు-భగవంతుడు, జననము-మరణము, పునర్జన్మ-మోక్షం నమ్మకాలు-మూఢనమ్మకాలు ఇత్యాది విషయాలపై వీరికి తమవైన వ్యాఖ్యానాలు ఉన్నాయి.