వేదాంతదేశికులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రాముడురాముడు
పంక్తి 16:
 
==రచనలు==
'''వేదాంత దేశికులు''' సర్వార్ధ సిద్ధి, న్యాయ పరిశుద్ధి, న్యాయ సిద్ధాంజన, మీమాంసా పాదుక, అధికరణ సారావళి, శాత దూషిణి, సచ్చరిత్ర రక్ష, నిషేపరాక్ష, పంచరాత్ర రక్ష మొదలైన దార్శనిక సంబంధమైన సంస్కృత గ్రంథాలను రచించాడు. రామానుజుల "శ్రీ భాష్యా" నికి తత్వటీకను, తాత్పర్య చంద్రికలను, యామునాచార్యుల గీతార్థసంగ్రహ రక్షను, రామానుజుల గద్య త్రయానికి రహస్య రక్షను, ఈశావాస్యోపనిషత్ భాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశాడు. ద్రావిడ ప్రబంధమైన ‘’తిరువాయి మొలి’’ని సంస్కృతీకరించాడు. యాదవాభ్యుదయం అనే మహా కావ్యాన్ని, [[సంకల్ప సూర్యోదయం]] అనే నాటకాన్ని, హంస సందేశం అనే లఘుకావ్యాన్ని ,పాదుకా సహస్రం, వరదరాజ పంచాశతి, గరుడ దండకం అనే ముక్తక కావ్యాలను వ్రాశాడు. ఇతడు రామాయణ కథాసారాన్ని "రఘువీర గద్య"గా సంస్కృతంలో వ్రాశాడు. అచ్యుత శతకాన్ని ప్రాకృతంలో రచించాడు. ఇతడు సంకల్ప సూర్యోదయం అనే నాటకాన్ని వ్రాశాడు. ఇది దార్శనికతకు ప్రతీకాత్మకమైన నాటకం. ఇతడు రహస్య గ్రంథాలైన తత్వ పదవి, రహస్య పదవి, తత్వ నవనీతం, రహస్య నవనీతం, తత్వ మాతృక, రహస్య మాతృక, తత్వ సందేశం, రహస్య సందేశవివరణం, తత్వ రత్నావళి, తత్వ రత్నావళి ప్రతిపాద్య సంగ్రహం, రహస్య రత్నావళి, రహస్య రత్నావళి హృదయం, తత్వ త్రయ చూలకం, రహస్య త్రయ చూలకం, అభయ ప్రదానసారం, రహస్య శిఖామణి, అంజలి వైభవం, ప్రదాన శతకం, ఉపహార సంగ్రహం, సార సంగ్రహం, మునివాహన భోగం, మధురకవి హృదయం, పరమపద సోపానం, పరమత భంగం, హస్తిగిరి మహాత్మ్యం, శ్రీమత్ రహస్య త్రయ సారం, సారసారం, పరిహారం ఇత్యాదులను రచించాడు.
===యాదవాభ్యుదయం===
ఇతని యాదవాభ్యుదయం కావ్యంలో ఇరవైనాలుగు సర్గాలున్నాయి. శ్రీకృష్ణ చరిత్రకావ్యం ఇది. కృష్ణుని జీవితం లోని ప్రతి సంఘటన వెనుక ఉన్న దార్శనికార్ధాన్ని కమ్మని శైలిలో వర్ణించాడు. ఈ కావ్యానికి అప్పయ్య దీక్షితులు వ్యాఖ్యానం రాయటం మరో విశేషం. వర్ణనలలో వేదాన్తపర మైన ఉపమానాలను వాడటం దేశికుల ప్రత్యేకత.
"https://te.wikipedia.org/wiki/వేదాంతదేశికులు" నుండి వెలికితీశారు