వేదాంతం రత్తయ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''వేదాంతం రత్తయ్య శర్మ''' (జ.1943) కూచిపూడి నాట్యాచార్యుడు.
==జీవిత విశేషాలు==
ఆయన అన్నపూర్ణమ్మ, రామయ్య దంపతులకు జన్మించాడు. ఆయన [[వేదాంతం పార్వతీశం]], [[చింతా కృష్ణమూర్తి]], [[వెంపటి చినసత్యం]] యొక్క ఆరాధకుడు. ఆయన వివిధ ప్రదర్శనలలో [[హిరణ్యకశిపుడు]], [[బాణాసురుడు]], [[అనిరుద్ధుడు]], [[శివుడు]], [[శ్రీరాముడు]], [[వేంకటేశ్వరుడు|శ్రీనివాసుడు]] పాత్రలను, రంగసాని వంటి స్త్రీ పాత్రలను ధంరించాడు. ఈ నటన మాత్రమే కాకుండా ఆయన వివిధ నృత్య నాటికలను వ్రాసి వాటికి దర్శకత్వం వహించేవాడు. వెంపటి చినతత్యం డ్రామాలలో ఆయన అనేక వైవిధ్యమైన పాత్రలను పోషించాడు.అ అయన [[ఆకాశరాజు]], [[భృగు మహర్షి|భృగుమహర్షి]], చోళరాజు గా పద్మావతీ శ్రీనివాస కళ్యాణం నాటకంలోనూ, [[దక్షుడు|దక్షు]]నిగా [[హరవిలాసం]] నాటకంలోనూ, యితర నాటకాలలో వివిధ పాత్రలను ధరించాడు. ప్రత్యేకంగా శివధనుర్భంగం, [[క్షీరసాగర మథనం]], [[రుక్మిణీ కళ్యాణం|రుక్మిణీ కల్యాణం]] లలో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలలో నటించాదు. అదే కాకుండా సినిమాలలో కూడా నటించాడు.
 
ఆయన దేశ విదేశాలలో 2000లకు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఆయన 1969 నుండి కూచిపూడి కళాక్షేత్రంలో నాట్యాచార్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆ సంస్థకు ప్రధానాధ్యాపకులు గా ఉంటూ ప్రహ్లాద విజయ యక్షగానం, గిరిజా కల్యాణం, అర్థనారీశ్వరం, [[క్షీరసాగర మథనం]], [[భామాకలాపం]] నాటకాలకు నృత్య దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web |url=http://www.kuchipudi.com/personalities/person10/ |title=కూచిపూడి వెబ్‌సైటులో వేదాంతం రత్తయ్య శర్మ జీవిత చరిత్ర |website= |access-date=2016-11-13 |archive-url=https://web.archive.org/web/20161207171636/http://www.kuchipudi.com/personalities/person10/ |archive-date=2016-12-07 |url-status=dead }}</ref>