న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''న్యాయపతి రాఘవరావు''' ([[1905]] - [[1984]]) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, [[ఆంధ్ర బాలానంద సంఘం]] సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళావిదుడు,కళాకోవిదుడు మరియు రచయిత.
 
==బాల్యం==
పంక్తి 8:
 
==రేడియో అన్నయ్య==
పాఠశాల చదువు అనంతరం [[విజయనగరం]] లోని [[మహారాజ కళాశాల]] లో డిగ్రీ పూర్తిచేసి [[మద్రాసు]] లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. [[ఆల్ ఇండియా రేడియో|ఆకాశవాణి]] లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రాఘవరావు [[రేడియో అన్నయ్య]] గా అవతరించి ప్రతి ఆదివారం [[ఆటవిడుపు]] అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూపిలుపుఅంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసింది.
 
'''ఆటవిడుపు''' కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్యకూడా ఎక్కువ కావటంతో పది సంవత్సరాలలోపు పిల్లలకి శనివారం [[బాలానందం]] అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశాడు. వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆత్రుతగా వేచి చూసేవారు.
 
==రచనలు ==
రేడియో అన్నయ్య సృష్టించిన పాత్రల్లో మొద్దబ్బాయి, పొట్టిబావ, చిట్టిమరదలు, దొడ్డమ్మ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, పిల్లలకే స్వరాజ్యం వస్తే, చీమ కథ, ఏనుగొచ్చిందేనుగు, బడి గంట, మడతకుర్చీ, రామూ సోమూ, పిల్లల దొంగ ఇంకా అనేక హాస్య నాటికలు, గమ్మత్తు నాటికలు, చిట్టి నాటికలు దాదాపు పన్నెండు వందలకు పైగా రచించి వాటిని పిల్లలతో వేయించాడు. దాదాపు పది చలన చిత్రాలలో కూడా పిల్లలచే వేషం వేయించాడు. అనేక గ్రామఫోను రికార్డులు ఇచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎవరూ, ఏ సంస్థా , ఏ ప్రభుత్వమూచేయనంత కృషి సలిపాడు. 1940లో రేడియో అన్నయ్య [[ఆంధ్ర బాలానంద సంఘం]] ను [[మద్రాసు]]లో స్థాపించాడు.
 
==బాలల కోసం పత్రిక==
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు