వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.([[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]], [[b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]).
 
బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నాడు <ref> https://southasia.berkeley.edu/telugu </ref>. తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది <ref> http://guide.berkeley.edu/courses/telugu/ </ref>. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.
 
ఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.