రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 17:
[[File:Upper view of Kapila Theertham waterfalls Tirupathi.JPG|thumb|కపిలతీర్థం లోని జలపాతాలు]]
 
'''రాయలసీమ ప్రాంతం,''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ([[కర్నూలు జిల్లా|కర్నూలు]], [[కడప జిల్లా|కడప]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]]లో భాగంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడింది. ఇంకా [[కాకతీయులు|కాకతీయ]], ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగింది. [[బ్రిటిషు]] వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన [[నిజాం|నిజాం సుల్తాను]]లు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం''' అని పేరు వచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]], [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో [[అనంతపురం జిల్లా|అనంతపురం]]ను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు