వెంపటి సదాశివబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చిత్రసమాహారం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 56:
 
===60వ దశకం===
1960 లో '[[దేవాంతకుడు]]', చిత్రానికి కథ, మాటలు వ్రాసింది వెంపటే. (ఈ సోషియో ఫాంటసీ చిత్రంలోని 'గోగ్గో గోంగూర' పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో 'యమగోల'గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత 'యమలీల, యమదొంగ' వంటి చిత్రాలకు మూల బిందువు వెంపటి కథే. 1961 లో 'ఉషా పరిణయం', '[[కన్న కొడుకు]]' '[[శభాష్‌ రాజా]]' చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. '[[లవకుశ]]' (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటిదే. 1964 లో బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన '[[మై రావణ]]'కు, గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన 'పల్నాటి యుద్ధం' చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన [[పరమానందయ శిష్యుల కథ]] చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు వ్రాశాడు. లలితా శివజ్యోతి వారి '[[రహస్యం (సినిమా)|రహస్యం]]' (1967) ఈయన చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించాడు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం వ్రాశాడు.
 
సదాశివబ్రహ్మం [[జనవరి 1]], [[1968]] సంవత్సరంలో గుండెపోటుతో ఆకస్మికంగా [[చెన్నై]]లో పరమపదించారు.